ప్రభాస్ 'స్పిరిట్'లో తరుణ్.. ఏం ప్లాన్ చేశావయ్యా సందీప్..!
on Jul 6, 2025
అప్పట్లో తరుణ్ కి తెలుగునాట లవర్ బాయ్ గా మంచి ఇమేజ్ ఉండేది. కెరీర్ స్టార్టింగ్ లో 'నువ్వే కావాలి', 'నువ్వు లేక నేను లేను', 'నువ్వే నువ్వే' వంటి విజయవంతమైన చిత్రాలతో యువతకు ఎంతగానో చేరువయ్యాడు తరుణ్. అయితే ఆ తర్వాత మాత్రం పెద్దగా విజయాలు చూడలేదు. ఇక కొన్నేళ్లుగా అసలు నటనకే దూరమయ్యాడు. అలాంటి తరుణ్ రీ-ఎంట్రీకి రెడీ అయినట్లు తెలుస్తోంది. అది కూడా స్పిరిట్ సినిమాతో అని ప్రచారం జరుగుతోంది.
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూవీ స్పిరిట్. కేవలం ప్రకటనతోనే ఈ సినిమాపై అంచనాలు భారీస్థాయిలో నెలకొన్నాయి. ఇందులో కొరియన్ యాక్టర్ డాన్ లీ విలన్ గా నటిస్తున్నట్లు వార్తలొచ్చాయి. దీంతో స్పిరిట్ పై అంచనాలు మరోస్థాయికి వెళ్ళాయి. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. అదేంటంటే స్పిరిట్ లో తరుణ్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు వినికిడి.
ఇటీవల తరుణ్.. డాన్ లీతో దిగిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దాంతో తాను స్పిరిట్ లో నటిస్తున్నానని హింట్ ఇచ్చినట్లుగా ఉంది. ఆ ఫొటో చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అప్పట్లో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న తరుణ్.. ఇప్పుడు రీ-ఎంట్రీలో ఎలా కనిపిస్తాడనే ఆసక్తి నెలకొంది.
సందీప్ రెడ్డి సినిమాల్లో పాత్రలు ఎంత పవర్ ఫుల్ గా ఉంటాయో తెలిసిందే. 'యానిమల్'లో బాబీ డియోల్ కి అదిరిపోయే బ్రేక్ ఇచ్చాడు. నిడివి తక్కువయినా, డైలాగ్స్ లేకపోయినా.. బాబీ డియోల్ రోల్ ని సందీప్ చూపించిన తీరు ఆకట్టుకుంది. దానిని దృష్టిలో పెట్టుకునే.. స్పిరిట్ లో తరుణ్ ని ఎలా చూపిస్తాడనే ఇంట్రెస్ట్ కలుగుతోంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
