తమన్నాకి ఈ సంవత్సరం కలిసి రాలేదు
on Dec 10, 2014
.jpg)
తమన్నా..టాలీవుడ్ లో ముద్దుగా మిల్కీ బ్యూటి అని పేర్కొంటుంటారు. ఈమె తెలుగులో, హిందీలో వరుస సినిమాలు చేసిన సక్సెస్ లో మాత్రం బాగా వెనుకబడిపోయింది. బాలీవుడ్ లో 'హిమ్మత్ వాలా'తో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా పరాజయం చెందింది. 'హమ్ షకల్స్' చేసినా ఈ సినిమా కూడా సక్సెల్ కాలేదు. అయినా ఏమాత్రం కృంగిపోకుండా 'ఎంటర్ టైన్ మెంట్' అనే సినిమా చేసింది. అది కూడా హిట్ కాలేదు. వరుసగా బాలీవుడ్‌లో ఫ్లాపులు చవిచూస్తోన్న తమన్నా మీద అప్పుడే ఐరన్ లెగ్ అన్న ముద్ర పడిపోయింది. ఆ మాటకొస్తే, తమన్నాకి తెలుగులోనే సక్సెస్ అంత తేలిగ్గా దొరకలేదనుకోండి.. అది వేరే విషయం. ఈమెకి కలిసివచ్చింది మాత్రం తమిళ చిత్ర పరిశ్రమే. ఎందుకంటే ఈమెకు వచ్చిన ఎక్కువ హిట్ సినిమాలు అక్కడివే. ఈ సంవత్సరం అజిత్‌తో నటించిన ‘వీరమ్’ ఒక్కటే తమన్నాకి ఊరటనిచ్చింది. తెలుగులో నటించిన ఆగడు కూడా డిజాస్టర్ అయ్యింది. దీంతో తమన్నా ఆశలన్నీ‘బాహుబలి’ మీద వున్నాయి. రాజమౌళి ఇంతవరకు ఫ్లాప్ ఇవ్వలేదు కాబట్టి తమన్నా అతడే తన రాత మార్చేస్తాడని ఫిక్సయిపోయింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



