విక్రమ్ కిలాడీ అంటున్న నిత్య
on Jul 6, 2015
హాట్ హాట్ కామెంట్స్ తో హల్ చల్ చేసే నిత్యామీనన్...ఓ హీరో నటనకి ఫిదా అయిపోయిందట. అందంతో పాటూ నటనలోనూ అదరగొట్టే నిత్యామీనన్ ను అంతలా ఇంప్రెస్ చేసిన హీరో ఎవరా అని ఆరాతీస్తే....విక్రమ్ అని తెలిసింది. శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ లాంటి సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించిన విక్రమ్ అంటే ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు.
రీసెంట్ మూవీ ఐ హిట్టవకపోయినా....విక్రమ్ కి మంచిమార్కులే పడ్డాయి. శంకర్ నెక్ట్స్ మూవీ రోబో సీక్వెల్లో విక్రమ్ విలన్ గా కనిపించనున్నాడని టాక్. అయితే ఫేవరెట్ హీరో గురించి గతంలో ఎన్ని ప్రశ్నలడిగినా నోరువిప్పని నిత్యా....రీసెంట్ గా విక్రమ్ సూపర్బ్ అని పొడగ్తల వర్షం కురిపించింది.
విక్రమ్ కు సరిసమానమైన నటుడే లేడంది. అతనో పెద్ద కిలాడీ అని చిలిపిగా కాంప్లిమెంట్ ఇచ్చింది. అంతెందుకు....విక్రమ్ నటనలో సగం నటించినా తిరుగులేదంది. దీంతో ఇన్నాళ్లూ లేనిది నిత్యా విక్రమ్ ని ఇప్పుడెందుకు పొడుగుతోంది అని డిస్కస్ చేసుకుంటున్నారు. దీనివెనుక ఆంతర్యం ఏంటో మరి!