'సీతా రామం' కాంబోలో మరో మూవీ!
on Sep 19, 2022

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'సీతా రామం'. వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న థియేటర్స్ లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇటీవల ఓటీటీలోనూ విడుదలై విశేష ఆదరణ పొందుతోంది. ఇదిలా ఉంటే 'సీతా రామం' కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
దర్శకుడిగా ఇప్పటిదాకా ఐదు సినిమాలు తీసిన హను.. మొదటి రెండు సినిమాలు 'అందాల రాక్షసి', 'కృష్ణ గాడి వీర ప్రేమ గాథ'తో ఆకట్టుకున్నప్పటికీ ఐదో సినిమాగా వచ్చిన 'సీతా రామం'తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన ప్రతిభను మెచ్చిన వైజయంతి సంస్థ ఆయనకు దర్శకుడిగా మరో అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ చిత్రంలోనూ దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జోడీనే నటించనుందని టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సమాచారం.
దుల్కర్, మృణాల్, హను, వైజయంతి మూవీస్ కాంబోలో వచ్చే ఫిల్మ్ మరోసారి 'సీతా రామం' మ్యాజిక్ రిపీట్ చేస్తుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



