కమల్ `విక్రమ్`లో `లవ్ లీ` భామ!?
on May 2, 2022
సరిగ్గా పదేళ్ళ క్రితం విడుదలైన తెలుగు చిత్రం `లవ్ లీ` (2012)తో కథానాయికగా తొలి అడుగేసింది శాన్వి శ్రీవాత్సవ. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న శాన్వి.. ఆపై `అడ్డా`, `రౌడీ`, `ప్యార్ మే పడిపోయానే` వంటి తెలుగు చిత్రాల్లో సందడి చేసింది. అయితే, ఆయా సినిమాలు ఆశించిన విజయం సాధించకపోవడంతో.. శాండల్ వుడ్ బాట పట్టింది. కన్నడ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శాన్వి.. త్వరలో మలయాళంలోనూ ఎంటర్టైన్ చేయనుంది.
ఇదిలా ఉంటే, తాజాగా శాన్వికి ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే ఛాన్స్ దక్కిందట. ఆ వివరాల్లోకి వెళితే.. లోక నాయకుడు కమల్ హాసన్ టైటిల్ రోల్ లో `విక్రమ్` పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. `ఖైదీ`, `మాస్టర్` చిత్రాల దర్శకుడు లోకేశ్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో శాన్వి ఓ స్పెషల్ రోల్ చేస్తోందట. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్ లో దాదాపు పది నిమిషాల పాటు శాన్వి కనిపిస్తుందని సమాచారం. అదే గనుక నిజమైతే.. శాన్వికి ఇది గోల్డెన్ ఆఫరే. త్వరలోనే `విక్రమ్`లో శాన్వి ఎంట్రీపై క్లారిటీ రానున్నది.
కాగా విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న `విక్రమ్` జూన్ 3న విడుదల కానుంది. తెలుగులోనూ ఈ కోలీవుడ్ ప్రాజెక్ట్.. అనువాద రూపంలో అలరించనుంది.