క్యాట్స్ ని మర్చిపోలేకపోతున్న సల్మాన్
on May 20, 2015
ఏకాంతంగా ఉన్నా...ఎందరి మధ్యన ఉన్నా...నిన్నే నేను ఆరాధిస్తున్నా...అని పాడుకుంటున్నాడట కండలవీరుడు సల్మాన్ ఖాన్. భాయ్ కి చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా....మరి ఏ వదినమ్మ పైనో అంటారా? ఇంకెవరండీ తాజామాజీ కత్రినా కైఫ్. త్వరలో పెళ్లిపీటలెక్కబోతోన్న కత్రినాను సల్మాన్ మరవలేకపోతున్నాడట. కోర్టు కేసు నుంచి కాస్త రిలీఫ్ వచ్చాక ప్రస్తుతం భజరంగీభాయ్ షూటింగ్ లో ఉన్నాడు. కాశ్మీర్ లో షూటింగ్ జరగుతుండడంతో ఈ మధ్య వచ్చిన టెన్షన్స్ నుంచి కాస్త రిలీఫ్ పొందుతున్నాడట. అక్కడి రొమాంటిక్ ప్లేస్ చూసేసరికి ఒక్కసారిగా తన మాజీ గర్ల్ ఫ్రెండ్ ని గుర్తుచేసుకున్నాడు. అక్కడి అందాలను ఫొటోలు తీసి ట్విట్టర్లో అప్ డేట్ చేసిన భాయ్....కాశ్మీర్ సహజసౌందర్యానికి పెట్టింది పేరు అని ట్వీట్ చేశాడు. అక్కడితో ఆగిఉంటే సరిపోయేది.....తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కత్రినా కాశ్మీర్ కు చెందినదే అంటూ మరో ట్వీట్ చేశాడు. దీంతో కాస్త తగ్గు బాబూ....అమ్మడు అక్కడ పెళ్లిపీటలెక్కేందుకు సిద్ధంగా ఉందని చెబుతున్నారు. ఇంతకీ మాజీ ప్రేమికుడి మాటలకు కత్రినా ఎలా రియాక్ట్ అవుతుందో...... కాబోయే భార్యపై సల్మాన్ ట్వీట్ కి రణబీర్ ఎలా స్పందిస్తాడో చూద్దాం.