SSMB29 కోసం రాజమౌళి మాస్టర్ ప్లాన్.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్..!
on Oct 21, 2025

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్ లో నిర్మాత కె.ఎల్. నారాయణ భారీ బడ్జెట్ తో ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ 'ఫస్ట్ రివీల్' నవంబర్ లో ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే రాజమౌళి ఓ భారీ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. (SSMB29)
సాధారణంగా టైటిల్, ఫస్ట్ లుక్, గ్లింప్స్ వంటివి డిజిటల్ వేదికగా రిలీజ్ చేస్తుంటారు. కానీ, రాజమౌళి రూటే సెపరేటు కదా.. అందుకే హైదరాబాద్ లో ఒక భారీ ఈవెంట్ ని నిర్వహించే సన్నాహాల్లో ఉన్నారట. నవంబరు 11 లేదా 15న ఈ ఈవెంట్ జరిగే అవకాశముందని తెలుస్తోంది. ఈ వేడుకలో టైటిల్ ని రివీల్ చేయడంతో పాటు, గ్లింప్స్ విడుదల చేయనున్నారని సమాచారం. అంతేకాదు, ఈ వేడుక అభిమానుల సమక్షంలో ఘనంగా జరగనుందని అంటున్నారు.
స్టార్ హీరోల సినిమాలకు అభిమానుల సమక్షంలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లు జరగడం కామన్. ఇలా గ్లింప్స్ రిలీజ్ కోసం ఓ భారీ ఈవెంట్ ప్లాన్ చేయడం అనేది ఇదే మొదటిసారని చెప్పవచ్చు. హైదరాబాద్ తర్వాత పలు మేజర్ సిటీలలోనూ వరుస ఈవెంట్స్ చేసే ఆలోచనలో రాజమౌళి & టీమ్ ఉందని ప్రచారం జరుగుతోంది.
మహేష్-రాజమౌళి సినిమాకి రకరకాల టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ఇటీవల 'వారణాసి' టైటిల్ ప్రముఖంగా వినిపించింది. మరి ఈ మూవీ టైటిల్ అదా కాదా? అనేది త్వరలోనే తేలిపోనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



