ఇండస్ట్రీ పాలిటిక్స్: రుద్రమదేవి వర్సెస్ సైజ్ జీరో
on Sep 26, 2015
టాలీవుడ్ ఇండస్ట్రీలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దసరా సీజన్ ను క్యాష్ చేసుకోనేందుకు నిర్మాతలు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ ఇండస్ట్రీ హీట్ ను పెంచుతున్నారట. ఈ రోజు ఉదయం నుంచి రుద్రమదేవి సినిమా వాయిదా పడిందనే వార్తలు మీడియాలో పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తూ వచ్చాయి. అంతలోనే సడన్ గా మరో సినిమా సైజ్ జీరో అక్టోబరు 9న వస్తోందనే వార్త బయటకు వచ్చింది. దీంతో మీడియాలో పెద్ద ఎత్తున రుద్రమదేవి వాయిదా పడిందని, అదే రోజు అనుష్క ‘సైజ్ జీరో’ విడుదల అవుతుందనే వార్త ప్రచారం అవుతుండగా అసలైన ట్విస్ట్ ఇప్పుడే బయటకు వచ్చింది.
‘రుద్రమదేవి’ సినిమా వాయిదా పడలేదని.. అనుకున్నట్లే అక్టోబరు 9న ప్రేక్షకుల ముందుకొస్తుందని పీఆర్వో స్వయంగా కన్ఫమ్ చేశాడు. అలాగే సోషల్ మీడియాలోని రుద్రమదేవి అఫీషియల్ పేజీలో కొత్తగా మళ్లీ అక్టోబరు 9న రిలీజ్ అంటూ పోస్టర్ లు విడుదల చేశారు. దీంతో ఇండస్ట్రీ లోని పాలిటిక్స్ ఒక్కసారిగా బయటపడ్డాయి.
అసలు అక్టోబర్ 2న రావాల్సిన సైజ్ జీరో సినిమా అక్టోబరు 9న ఎందుకు రిలీజ్ చేస్తున్నారన్నది ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. మరోవైపు రుద్రమదేవికి వున్న ఫైనాన్స్ సమస్యలు మిగిలన వాళ్లకు అక్కరకు వస్తున్నాయని టాలీవుడ్ టాక్. ఎక్కడో తాడు లాగితే, ఇంకెక్కడో ఏదో కదలిందన్న చందంగా రుద్రమదేవికి అడ్డంకులు వస్తున్నాయని వదంతులు వినిపిస్తున్నాయి.అయితే ఓకే రోజు రెండు సినిమాల్నీ రిలీజ్ చేయడం వాళ్ళ నిర్మాతలే నష్టపోవాల్సి వుంటుంది..లేదనుకుంటే ఓ సినిమా వెనక్కి తగ్గాల్సి వుంటుంది. మరి ఈ రెండిటిల్లో ఏ సినిమా వాయిదా పడుతుందో వేచి చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
