పీక్ కు చేరిన సెల్ఫీల పిచ్చి
on Apr 8, 2015
సెల్ఫీల పిచ్చి పీక్ కు చేరుతోంది. ఇక్కడ అక్కడ అనే తేడా లేదు. ఎక్కడ పెడితే అక్కడ సెల్ఫీలు తీసుకుని....వాటిని పోస్ట్ చేసి నానా హడావుడి చేస్తున్నారు. అయితే వీటికి హద్దు పద్దు లేదా? అని కొందరు మండిపడుతున్నారు. ఏదో టూరిస్ట్ స్పాట్ లోనో, పార్టీల్లోనో సెల్ఫీలు తీసుకున్నారంటే సరేకానీ...హాస్పటల్ బెడ్ పై సెల్ఫీలేంటండీ బాబూ....! హాస్పటల్లో అడ్మిట్ అయినప్పటి నుండీ ఎంత తొందరగా కోలుకుంటామా....ఎంత త్వరగా డిస్సార్జ్ అయి ఇంటికొస్తామా అనిపించాలి. కానీ రోగాన్ని కూడా ఫుల్లుగా వాడేసుకోవడం టూ మచ్ అంటున్నారు. ఆ మధ్యే పరిణీతిచోప్రా హాస్పటల్ బెడ్ పై ఉండగా సెల్ఫీ దిగి ట్విట్టర్లో పెట్టింది. బాజీరావ్ మస్తానీ సెట్స్ లో గాయపడిన రణవీర్ సింగ్ కూడా బెడ్ పై ఉండగా సెల్ఫీ తీసుకున్నాడు. స్వైన్ ఫ్లూ బారినపడిన సోనమ్ కపూర్, బ్రెయిన్ సర్జరీ చేయించకున్న హృతిక్ రోషన్ ఇలా వీరంతా హాస్పటల్ బెడ్ పై ఉన్న ఫొటోలు ట్విట్టర్లలో పోస్ట్ చేసి ఫ్యాన్స్ ను బెంబేలెత్తించారు. ఈ తతంగం చూసిన కొందరు సెలబ్రెటీల సెల్ఫీల పిచ్చి పరాకాష్టకు చేరిందే అని రుసరుసలాడుతున్నారు.