'అలా ఎలా' దర్శకుడితో రానా..!!
on Dec 18, 2015
.jpg)
ఎలాంటి అంచనాలు, ఎలాంటి హంగామా లేకుండా సైలెంట్ గా వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా 'అలా ఎలా?'. ఈ సినిమాతో తన సత్తాను నిరూపించుకున్న దర్శకుడు అనీష్ కృష్ణ. ఇప్పుడీ దర్శకుడు తన రెండో సినిమాకి రంగం సిద్ధం చెసుకుంటున్నాడు. తన రెండో సినిమా కోసం హీరో రానాని ఒప్పించాడీ దర్శకుడు. ఇటివలే ఓ డిఫరెంట్ సబ్జెక్ట్ తో రానాను కలసిన అనీష్, కధను ఓకే చేయించుకున్నాడని తెలిసింది. రానా సొంత బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. ఈ చిత్రం పై త్వరలోనే ఓ ప్రకటన రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



