పవన్ ని అప్పుడు తిట్టి ఇప్పుడు తెగ పొగుడుతున్నాడు..!
on Jul 4, 2017
.jpg)
సినిమాల్లో, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ, శాశ్వత శత్రువులు కానీ ఉండరంటారు. నిన్నటి వరకు ప్రాణానికి ప్రాణం గా కనిపించిన మిత్రులు ఈ రోజు ఒకరంటే ఇంకొకరికి పాడనీ శత్రువులుగా అగుపించొచ్చు. అయితే, వీటికి కొన్ని పరిస్థితులు కారణం అవ్వొచ్చు, లేదా ఎవరయినా వాళ్లలో ఒకరిని ప్రభావితం చేసుండొచ్చు. 2014 లో పవన్ కళ్యాణ్ పార్టీ అనౌన్స్ చేసి అందరినీ చెడా మడా వాయించినపుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుకూలుడయిన హీరో రాజా జన సేన పార్టీ అధినేత మీద విపరీత విమర్శలు చేసాడు. పవన్ కళ్యాణ్ ఏమయినా దేవుడా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు.
ఆయనకీ నేను అనే అహంకారం ఎక్కువ. ఎవరో రాసిన స్క్రిప్ట్ చదువుతున్నాడు, అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఇప్పుడు అదే రాజా, పవన్ కళ్యాణ్ విషయంలో తన గొంతు మార్చాడు. పవన్ కళ్యాణ్ చాలా మృదు స్వభావి అని, చాలా తెలివయిన వాడని, ఈ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు. అభిమానులు పవన్ కళ్యాణ్ ని ఒక నటుడిగా కన్నా ఒక వ్యక్తి గా అభిమానిస్తారని అన్నాడు. అయితే, హీరో రాజాకి పవన్ కళ్యాణ్ విషయంలో ఇంత మార్పు ఎలా వచ్చింది అని అందరూ ఒకింత ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నారు. ఈ విషయం పక్కన పెడితే, రాజా పవన్ కళ్యాణ్ ని మూడు సంవత్సరాల క్రితం దూషించినపుడు ఆయన చనిపోయాడని పవన్ అభిమానులు సోషల్ మీడియా లో ప్రచారం చేసిన విషయం మనకి తెలిసిందే!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



