పోలాండ్ లో వర్మ ‘ఎఫైర్’
on Apr 18, 2015
రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం అరడజనుకుపైగా సినిమా చిత్రీకరణలతో ఫుల్ బిజీగా కాలం గడుపుతున్నారు. ఆయన తీస్తున్న మూవీల్లో ఒకటైన ‘ఎఫైర్’ షూటింగ్ కోసం మూవీ యూనిట్ తో ఆరేళ్ల తర్వాత విదేశానికి వెళ్లారు. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో సచిన్ జోషి, మీరా చోప్రా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి మేజర్ పోర్షన్ షూటింగ్ కంప్లీట్ అయింది. రెండు మూడు పాటలతోపాటు మరికొన్ని కీలక సన్నివేశాలు మాత్రమే షూట్ చేయాల్సి వుంది. ఆ సీన్లను కంప్లీట్ చేయడం కోసమే ఈ చిత్రం యూనిట్ పొలాండ్ కి పయనమైంది. ఈ నేపథ్యంలోనే హీరో సచిన్ తాను, వర్మ, మీరా ముగ్గురు కలిసి వున్న సెల్ఫీ ఫోటోను ట్విట్టర్ లో అప్ లోడ్ చేశాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
