వరుణ్ పై కన్నేసిన పూరీ
on Apr 30, 2015
ఒడ్డు, పొడుగు మాత్రమే కాదు విషయం ఉందని నిరూపించుకున్నాడు వరుణ్ తేజ పోయి పోయి పూరీ చేతిలో పడ్డాడా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మెగా ఫ్యామిలీ నుంచి ఎంటరైన వరుణ్ తేజ్ ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి మార్కులే సంపాదించుకున్నాడు. దీంతో డాషింగ్ డైరెక్టర్ కన్ను ఈ కుర్రాడిపై పడిందట. వరుణ్ తో అదిరిపోయే యాక్షన్ ఎంటర్ టైనర్ తీయాలనే ఆలోచనలో ఉన్నాడట. అప్పుడే వరుణ్ ని అడగడం గ్రీన్ సిగ్నల్ రావడం కూడా జరిగిపోయిందట. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో కంచెలో నటిస్తున్న వరుణ్..అది పూర్తయ్యాక పూరీతో చేయికలపనున్నాడని టాక్. అయితే ఈ మధ్య పూరీ వరుస సినిమాలైతే తీస్తున్నాడు కానీ సరైన విజయాల్లేవ్. ఇప్పుడిప్పుడే కెరీర్ స్టార్ట్ చేసిన వరుణ్ ఓసారి ఆలోచించుకుంటే మంచిదనే సలహాఇస్తున్నారు కొందరు. అయితే చిన్నా చితకా సినిమాలు చేసుకుంటున్న రవితేజకు ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం తో కెరీర్ కి టర్నింగ్ ఇవ్వలేదా అని క్వశ్చన్ చేసిన వాళ్లూ లేకపోలేదు. మొదటి సినిమా హిట్టవకపోయినా పర్వాలేదనిపించుకుంది. రెండో సినిమా క్రిష్ దర్సకత్వంలో కాబట్టి కమర్షియల్ సక్సెస్ మాట పక్కనపెడితే సినిమాకు మంచి మార్కులే పడతాయి. మరి ముచ్చటగా మూడో సినిమా పూరీతో అంటే....అయితే అదిరిపోయే కమర్శియల్ సక్సెస్ లేదంటే దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయ్యే ఫ్లాప్. మరి వరుణ్ తేజ లక్కు ఎలాఉంటుందో చూద్దాం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
