ఏపీ ఎమ్మెల్యేతో యాంకర్ ప్రదీప్ పెళ్లి..!
on Nov 7, 2024
వెండితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ గా ప్రభాస్ పేరు వినిపించినట్టుగానే, బుల్లితెరపై యాంకర్ ప్రదీప్ వినిపిస్తూ ఉంటుంది. అయితే త్వరలోనే ప్రదీప్ ఓ ఇంటివాడు కాబోతున్నాడని, అది కూడా ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఒక ఎమ్మెల్యేని పెళ్లాడబోతున్నాడని ప్రచారం జరుగుతోంది.
బుల్లితెరపై మేల్ యాంకర్స్ లో ప్రదీప్ కి ఎంతో క్రేజ్ ఉంది. వెండితెరపై కూడా రాణిస్తున్నాడు. అయితే 40 ఏళ్ళు వస్తున్నా ఇంకా పెళ్లి చేసుకోలేదు. దీంతో పెళ్ళెప్పుడు అనే ప్రశ్న ఆయనకి ఎప్పటినుంచో ఎదురవుతుంది. అయితే ఆ ప్రశ్నకు ఎట్టకేలకు సమాధానం చెప్పబోతున్నాడట. ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ఎమ్మెల్యేతో ప్రదీప్ పెళ్లి జరగనుందని న్యూస్ చక్కర్లు కొడుతోంది. రెండేళ్ల నుంచి వీరి మధ్య ప్రేమ నడుస్తుందని, పెద్దల అంగీకారంతో త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read