బాలయ్య, పవన్ ఒకే సినిమాలో..!
on Nov 24, 2014
నందమూరి బాలకృష్ణ 98వ సినిమా పూర్తికాలేదు. 99కనీసం మొదలు కాలేదు, కానీ అప్పుడే 100వ సినిమాపై గుసగుసలు మొదలయ్యాయి. తాజాగా ఓ సంచలన రూమర్ ఫిలింనగర్ లో ప్రచారంలో ఉంది. అదేమంటే బాలయ్య శతక సినిమాలో పవన్ కళ్యాణ్ నటిస్తాడట. ఈ వార్త ఎంతవరకు నిజమనేది తెలియకపోయినా, అబద్దమని మాత్రం కొట్టిపారేయలేము. ఎందుకంటే వీరిద్దరూ కలిసి సినిమాలు చేయమని ఎప్పుడూ చెప్పలేదు. తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ 100వ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ గెస్టో రోల్ చేస్తాడని అంటున్నారు. అంటే ప్రస్తుతం వెంకటేష్ ‘గోపాల గోపాల’ సినిమాలో పవన్ నటిస్తున్నట్లుగానే బాలకృష్ణ వందవ సినిమాలోనూ నటిస్తాడని అంటున్నారు. ఇక మరొక గాసిప్ ఏమిటంటే బాలయ్యకు ‘సింహ’, ‘లెజెండ్’ తో రెండు వరుస హిట్లు ఇచ్చిన బోయపాటి శ్రీను సినిమాకు డైరెక్టర్ గా ఉంటాడని కూడా అంటున్నారు. వినటానికే చాలా ఆసక్తిగా, క్రేజీగా ఉన్న కాంబినేషన్ కార్యరూపం దాలిస్తే మాత్రం కమర్షియల్ గా హిట్ ఖాయం, అదేవిధంగా సెన్సేషన్ క్రియేషన్ అవుతుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
