'ఆంధ్ర కింగ్ తాలూకా'లో బిగ్ సర్‌ప్రైజ్.. గెస్ట్ రోల్ లో పాన్ ఇండియా స్టార్!
on Nov 22, 2025

స్టార్ హీరోలు అతిథి పాత్రల్లో మెరవడం అప్పుడప్పుడు చూస్తుంటాం. త్వరలో విడుదల కానున్న 'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమాలో కూడా ఓ పాన్ ఇండియా హీరో గెస్ట్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. (Andhra King Taluka)
ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్ పోతినేని, ఈ నవంబర్ 27న 'ఆంధ్ర కింగ్ తాలూకా'తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. మహేష్ బాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో.. ఆంధ్ర కింగ్ సూర్య కుమార్ అనే హీరోకి అభిమానిగా రామ్ నటిస్తున్నాడు. రామ్ కి జోడిగా భాగ్యశ్రీ బోర్సే అలరించనుంది. ఇక హీరో సూర్య కుమార్ పాత్రలో కన్నడ స్టార్ ఉపేంద్ర సందడి చేయనున్నాడు. ఇదిలా ఉంటే, ఈ సినిమా క్లైమాక్స్ లో ఒక పాన్ ఇండియా హీరో సర్ ప్రైజ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.
Also Read: ఇద్దరిదీ ఒకే స్థితి.. ఏమిటి ఈ పరిస్థితి...
ఇటీవల 'ఆంధ్ర కింగ్ తాలూకా' మూవీ ప్రమోషన్స్ లో ఉపేంద్ర మాట్లాడుతూ.. "ఆంధ్ర కింగ్.. నేను కాదు, రామ్ కూడా కాదు. సినిమాలో మరో వ్యక్తి ఉన్నాడు.. అతడే నిజమైన ఆంధ్ర కింగ్." అన్నాడు.
గెస్ట్ రోల్ లో మెరవనున్న ఆ పాన్ ఇండియా హీరోని ఉద్దేశించే.. ఉపేంద్ర ఈ కామెంట్స్ చేసి ఉంటాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరి 'ఆంధ్ర కింగ్ తాలూకా'లో నిజంగానే ఓ పాన్ ఇండియా హీరో గెస్ట్ రోల్ చేస్తున్నాడా? ఒకవేళ చేస్తే ఆ హీరో ఎవరు? అనేది నవంబర్ 27న తేలిపోనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



