జనతా గ్యారేజీ: బాషా టైపు స్టోరీ
on Dec 1, 2015
దక్షిణాది సినిమాల శైలిపై భారీగా ప్రభావం చూపించిన సినిమా రజనీకాంత్ బాషా. అనామకంగా హీరో జనాల మధ్య తిరిగేస్తుంటాడు. సాదా సీదా జీవితం గడుపుతుంటాడు. ఇంట్రవెల్ ముందు భారీ ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవుతుంది.. హీరో పెద్ద పోటుగాడని అందరికీ తెలుస్తుంది. ఇదీ బాషా టైపు కథల ఫార్ములా.
సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర, సింహాద్రి... ఇలా చాలా సినిమాలు బాషా టైపు కథలతో తయారైనవే. ఇప్పుడు జనతా గ్యారేజీ కథ కూడా అలాంటిదేనట. ఎన్టీఆర్ - కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం జనతా గ్యారేజ్. ఇందులో ఎన్టీఆర్ మెకానిక్‌గా కనిపించబోతున్నాడు.
ఫ్లాష్ బ్యాక్ లో .. ఎన్టీఆర్ ఓ పెద్ద మాఫియా డాన్ అని తేలుతుందట. దానికి అధినేత.. మోహన్ లాల్. ఎన్టీఆర్‌కీ,, మోహన్‌లాల్‌కీ ఉన్న బంధమేంటోసెకండాఫ్‌లో చూపిస్తారట. మొత్తానికి ఎన్టీఆర్ మరోసారి బాషా టైపు కథకి ఫిక్సయిపోయాడన్నమాట. ఇలా రొటీన్ కథలు పట్టుకొని వేళాడితే.. ఎన్టీఆర్ సూపర్ హిట్టు కొట్టడం అనుమానమే. కాకపోతే.. కొరటాల శివ సుడి బాగుంది. ఆ లక్.. ఎన్టీఆర్‌కి కలిసొస్తుందేమో చూడాలి.