చిరు.. పవన్‌ల సినిమా... అంతా తుస్ తుస్
on Feb 14, 2017

చిరంజీవి, పవన్ కల్యాణ్‌లతో ఓ సినిమా చేయాలన్నది సుబ్బిరామిరెడ్డి కల. ఈ విషయాన్ని ఓ ఫంక్షన్‌లో చిరు ముందే బయటపెట్టారు. అంతేకాదు... వారం తిరక్క ముందే మెగా మల్టీస్టారర్ చేస్తున్నా నంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. దర్శకుడిగా త్రివిక్రమ్ పేరు ఖరారు చేశారు. చిరు, పవన్, త్రివిక్రమ్‌లతో సంప్రదింపులు అయిపోయాయని, త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతుందని వార్తలొచ్చాయి. ఈ సినిమా కోసం ఏకంగా ఈ ముగ్గురికే రూ.60 కోట్ల వరకూ పారితోషికాలు ముట్టజెప్పారని వార్తలొచ్చాయి. అయితే ఇదంతా ఉత్తుత్తినే అని తేలిపోయింది.
అసలు సుబ్బిరామి రెడ్డి తన దగ్గర మెగా మల్టీస్టారర్ ప్రస్తావనే తీసుకురాలేదని పవన్ తేల్చేశాడు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న పవన్‌ని అక్కడి అభిమానులు మెగా మల్టీస్టారర్ ఎప్పుడు?? అని ప్రశ్నించారు. అసలు ఆ సంగతే తెలీదని సమాధానం దాటేశాడు పవన్. దాంతో... ఈసినిమా అంతా అంబక్ అని అర్థమైపోయింది. పవన్‌ని కలవకుండానే కలిసినట్టు, ఈ సినిమా ప్రపోజల్ ఏమీ లేకుండానే.. ఉన్నట్టు సుబ్బిరామిరెడ్డి ఎందుకు అంత కవర్ చేసుకొన్నాడో అర్థం కాలేదు. చిరు. పవన్‌లతో సినిమా అయ్యేపనికాదని, ఇదంతా గాలివార్తేనని చెప్పుకొన్న మాటలు నిజమే అన్నమాట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



