సూపర్ స్టార్ ను పట్టిన శేఖర్ కమ్ముల?
on Sep 22, 2015
టాలీవుడ్ క్లాసిక్ మూవీలు తీసే దర్శకుడిగా శేఖర్ కమ్ములకు మంచి పేరే వుంది. ‘హ్యాపీడేస్‌ను చూపించి, గోదావరి పరవళ్లు తెరపై ఆవిష్కరించి, లీడర్ ఎలా ఉండాలో చెప్పిన ఆయన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, అనామిక సినిమాల పరాజయం తరువాత ఆయన నుంచి ఒక్క సినిమా ఇంత వరకు తెరకెక్కలేదు. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు..తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేయబోతున్నాడు అనేది మాత్రం ఎవరికి తెలియదు.
లేటెస్ట్ గా శేఖర్ కమ్ములకు సంబంధించిన న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం శేఖర్ కథను సిద్దం చేస్తున్నాడట. ఆల్రెడీ ఆ స్టొరీకి సంబంధించిన లైన్ ను కూడా మహేష్ కు చెప్పడం కూడా జరిగిందని టాక్. ఈ కథకు సంబంధించిన మార్పులు, చేర్పులు ఎప్పటికప్పుడు బ్రహ్మోత్సవం సెట్ కూ వెళ్లి మహేష్ కి అప్ డేట్స్ చేస్తున్నాడట. ఈ కథ మొత్తం సూపర్ స్టార్ ఓకే చేస్తే వెంటనే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాలనే ఆలోచనలో వున్నాడట.
'బ్రహ్మోత్సవం' తరువాత ఏ డైరెక్టర్ కి మహేష్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో.. శేఖర్ కమ్ముల సినిమా స్టార్ట్ అయ్యే అవకశాలు ఎక్కువగా వున్నాయనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
