మోహన్ లాల్ కోరికను కాదన్న కొరటాల!
on Jul 28, 2016
కాంబినేషన్ రాసుకొనే దర్శకులు కొందరు, కథ రాసుకొన్నాక దానికి తగ్గ కాంబినేషన్ సెట్ చేసుకోగలిగే దిట్టలు ఇంకొందరు. ఈ రెండో కోవకు చెందిన దర్శకుడు కొరటాల శివ. అందుకే వరుసబెట్టి రెండు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాడు. కథ-కథనం-క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకపోవడం ఒక కారణం. ఆ కారణంగానే మలయాళ సూపర్ స్టార్ మోహల్ లాల్ "జనతా గ్యారేజ్" కోసం డబ్బింగ్ చెప్పుకొంటానని స్వయంగా కోరినా నిక్కచ్చిగా కాదనేశాడు కొరటాల.
"మనమంతా" సినిమా కోసం డబ్బింగ్ చెప్పుకొన్న మోహన్ లాల్ "జనతా గ్యారేజ్" కోసం కూడా అదే తరహాలో డబ్బింగ్ చెప్పుకోవాలని ఆశపడ్డాడు. అయితే.. "మనమంతా" ట్రైలర్ బానే ఉన్నప్పటికీ, ఆ ట్రైలర్ లో మోహన్ లాల్ వాయిస్ కి మాత్రం పెద్దగా పాజిటివ్ రిపోర్ట్ రాలేదు. దాంతో "జనతా గ్యారేజ్" కోసం మోహన్ లాల్ తో డబ్బింగ్ చెప్పించే అవకాశమే లేదనేశాడు కొరటాల. దాంతో మోహన్ లాల్ మొదట్లో ఏకీభవించనప్పటికీ ఎన్టీయార్ కలగజేసుకొని చెప్పడంతో విషయం సర్ధుమణిగిందని తెలుస్తోంది!