రాజమౌళికి కీరవాణి నో?!
on Oct 13, 2015
.jpg)
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలన్నిటికీ కీరవాణి సంగీత దర్శకుడన్న విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్‌లో ఈమధ్యే బాహుబలి ది బిగినింగ్ ఈమధ్యే విడుదలై భారీ విజయం సాధించింది. వీరి కాంబినేషన్లోనే వచ్చిన బాహుబలి ది కంక్లూజన్ వచ్చే ఏడాది విడుదల కాబోతోంది. లేటెస్ట్‌గా ఫిలింనగర్‌లో వినిపిస్తున్న టాక్ ఏంటంటే, బాహుబలి ది కంక్లూజన్ సినిమాతో రాజమౌళితో తన కాంబినేషన్‌కి కంక్లూజన్ ఇవ్వాలని కీరవాణి భావిస్తున్నాడట. కేవలం రాజమౌళి సినిమాలకి మాత్రమే కాదు... సంగీత దర్శకత్వానికే కంక్లూజన్ ఇచ్చేయాలని ఆయన అనుకుంటున్నట్టు సమాచారం.
కీరవాణి ఇప్పటికే సంగీత దర్శకుడిగా సినిమాలను పూర్తిగా తగ్గించుకున్నారు. రాజమౌళి దర్శకత్వం వహించే సినిమాలకు తప్ప బయటి సినిమాలను ఆయన ఒప్పుకోవడం లేదు. రాజమౌళి తనకు తమ్ముడి వరస కావడం వల్ల వీళ్ళ కాంబినేషన్ అలా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. అయితే ఇకముందు రాజమౌళి సినిమాలతో సహా ఏ సినిమాకీ సంగీతాన్ని ఇచ్చే ఉద్దేశంలో లేనట్టు కీరవాణి స్పష్టం చేసినట్టు సమాచారం. అది కాదు అన్నయ్యా... కనీసం నా ఒక్కడి సినిమాకి అయినా సంగీతం చేసిపెట్టు అని రాజమౌళి బతిమాలినా కీరవాణి వినలేదని అంటున్నారు.
తాను ఇక సినిమాలను వదిలేసి ప్రశాంతంగా వుండదలచుకున్నానని, సంగీత దర్శకుడిగా తాను చేసిన కృషి ఇక చాలని అనుకుంటున్నానని కీరవాణి క్లియర్‌గా చెప్పేశాడట. పోనీ తాను దర్శకత్వం వహించబోతున్న మహాభారతం సినిమా వరకైనా సంగీతాన్ని ఇవ్వాలని రాజమౌళి బతిమాలినా కీరవాణి నో చెప్పేశాడట. నీకు సింక్ అయ్యే మరో మ్యూజిక్ డైరెక్టర్ని వెతుక్కుంటే మంచిదని కూడా చెప్పేశాడని సమాచారం. అయితే పట్టువదలని ‘విక్రమార్కుడు’ రాజమౌళి కీరవాణిని ఒప్పించడానికి కుటుంబ సభ్యులవైపు నుంచి ప్రయత్నాలు చేస్తున్నాడట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



