సిగపట్లు పట్టుకున్న ముద్దుగుమ్మలు!
on May 11, 2015
.jpg)
సింగిల్ హీరోయిన్ తో సినిమా తీయడం కూల్.....ఇద్దరు ముద్దుగుమ్మలను మ్యానేజ్ చెయ్యడం టూ హాట్. ఈ విషయం లేట్ గా తెలుకున్నాడట ఆ దర్శకుడు. ముచ్చటపడి ఇద్దరు ముద్దుగుమ్మలకు ఛాన్స్ ఇచ్చాడు. తీరా సెట్లో చేరారో లేదో అప్పుడే రగడ మొదలెట్టేశారట. విషయం ఏంటంటే...కరైయోరమ్ అనే తమిళ చిత్రంలో నటిస్తున్న నిఖిషా పటేల్, ఇనియా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమంటోందట. ఒకటా రెండా క్యారెక్టర్ ఇంపార్టెన్స్ నుంచి కాస్ట్యూమ్స్ ప్రయారిటీ వరకు ప్రతి విషయంలోనూ పోటీ పడుతున్నారట. ఈ పోటీ ఆరోగ్యంకరంగా ఉంటే ఓకే..కానీ జెలసీకి దారితీసింది. దీంతో మరో అడుగు ముందుకేసి నువ్వెంత అంటే నువ్వెంత అంటూ మాటల యుద్ధానికి దారితీసింది. అది కూడా చాలదన్నట్టు షూటింగ్ లొకేషన్లోనే జుట్లు పట్టుకుని కుస్తీలు పట్టారట. దీంతో వామ్మో ఆడాళ్లు సమాన్యులు కాదని కోలీవుడ్ లో ఒకటే గుసగుసలు. అందుకే అంటారు.... ఇరవై మంది మగాళ్లు ఒక్కదగ్గరున్నా పర్వాలేదు కానీ ఇద్దరాడాళ్లు ఒక దగ్గర ఉంటే రచ్చే అని. ఇంతకీ ఈ గొడవకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో ఏమో!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



