'కాంతార-3'లో జూనియర్ ఎన్టీఆర్.. థియేటర్లలో పూనకాలే!
on Aug 4, 2025

పాన్ ఇండియా స్టార్స్ లో జూనియర్ ఎన్టీఆర్ లైనప్ రోజురోజుకి ఆసక్తికరంగా మారుతోంది. ఇతర భాషల్లో సినిమాలు చేస్తున్నాడు. ఇతర భాషల దర్శకులతో చేతులు కలుపుతున్నాడు. ఇప్పటికే 'వార్-2' అనే హిందీ ఫిల్మ్ చేశాడు. ఇది ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే, కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో 'డ్రాగన్' మూవీ చేస్తున్నాడు. తమిళ దర్శకుడు నెల్సన్ తోనూ ఓ సినిమా కమిటై ఉన్నాడు. ఇక ఇప్పుడు మరో కన్నడ డైరెక్టర్ తో ఎన్టీఆర్ చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. రిషబ్ శెట్టి.
'కాంతార'తో నటుడిగా, దర్శకుడిగా పాన్ ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించాడు రిషబ్ శెట్టి. ప్రస్తుతం తన స్వీయ దర్శకత్వంలో 'కాంతార-2' రూపొందుతోంది. ఇది అక్టోబర్ 2న విడుదల కానుంది. రిషబ్ 'కాంతార-3'ను కూడా ప్లాన్ చేస్తున్నాడు. అంతేకాదు, ఇందులో ఒక కీలక పాత్ర కోసం ఎన్టీఆర్ ను రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం.
ఎన్టీఆర్, రిషబ్ శెట్టి మధ్య మంచి అనుబంధం ఉంది. ఎన్టీఆర్ కర్ణాటకకు వెళ్తే.. ప్రశాంత్ నీల్ తో పాటు రిషబ్ ని కూడా కలుస్తుంటాడు. దాంతో వీరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. అయితే ఇప్పుడు 'కాంతార-3'లో ఎన్టీఆర్ నటించనున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా న్యూస్ వినిపిస్తోంది. అదే జరిగితే బాక్సాఫీస్ షేక్ అవుతుంది అనడంలో సందేహం లేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



