ఎన్టీఆర్... ఈసారి చరణ్‌ని టార్గెట్ చేశాడా?
on Jan 20, 2016
ఈ సంక్రాంతి పండక్కి బాబాయ్ బాలకృష్ణతో పోటీకి దిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఎన్టీఆర్. సంక్రాంతి బరిలో నిలిచిన డిక్టేటర్, నాన్నకు ప్రేమతో నువ్వా, నేనా అంటూ కొట్టుకొంటున్నాయి. ఈసారి రామ్‌చరణ్ పై యుద్ధం ప్రకటించాడు ఎన్టీఆర్. ఔను.. తన జనతా గ్యారేజీ సినిమాని తని ఒరువన్ కి పోటీగా నిలపనున్నట్టు టాక్. రామ్‌చరణ్ - సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌లో తని ఒరువన్ రీమేక్‌కి రంగం సిద్ధం అవుతోంది. ఆగస్టు 12న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.

ఆ డేట్‌ని ఎన్టీఆర్ టార్గెట్ చేశాడట. తన తదుపరి చిత్రం జనతా గ్యారేజీనీ అదే రోజున విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు ఎన్టీఆర్. మెగా - నందమూరి కుటుంబాల చిత్రాలు గతంలో ఒకేరోజు విడుదలైన సందర్భాలున్నాయి. కొంతకాలంగా.. అందరివీ సోలో రిలీజ్‌లే. పోటీ అనే మాటకే ప్రాధాన్యం ఇవ్వడం లేదు. అయితే ఎన్టీఆర్ మాత్రం పనిగట్టుకొని సవాళ్లు విసరడం... చిత్రసీమలో చర్చనీయాంశంగా మారింది. సినిమా మొదలవ్వకముందే.. రిలీజ్ డేట్ ప్రకటించడం... మంచిదే అయినా, పోటీ సినిమా ఏమిటి అనే విషయమూ చూసుకోవాలిగా. ఈ విషయంలో తారక్ ఇలా ఎన్ని తప్పులు చేస్తూ వెళ్తాడో?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



