శంకర్ ‘ఐ’కి భారీ డిమాండ్
on Dec 23, 2014
శంకర్ విజువల్ వండర్ ‘ఐ’ సంక్రాంతి రిలీజ్ కన్ఫర్మ్ చేసుకుంది. దాదాపు 180 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే విడుదలైన కొత్త ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో తెలుగు వెర్షన్ డిస్ట్రిబ్యూటర్స్‌లో బిజినెస్ హీట్ స్టార్ట్ అయిందని సమాచారం. ఈ చిత్ర పంపిణీ హక్కులు కూడా భారీ రేట్లకు అమ్ముడుపోయాయి. వైజాగ్ పంపిణీ హక్కులు 4కోట్లు, గుంటూరు పంపిణీ హక్కులు 3.6 కోట్లు, అలాగే కృష్ణ 2.25కోట్లు, తూర్పు గోదావరి హక్కులు 3 కోట్లకు అమ్ముడుపోయినట్లుగా తెలిసింది. జనవరి 9న తెలుగులో రిలీజ్ చేయడానికి నిర్మాతలు ఆల్రెడీ ప్లాన్ చేసినట్లు సమాచారం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
