అందరి కళ్ళు ఆ ఇంటిపైనే!
on Aug 6, 2016

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రస్తుతం మొహంజదారో సినిమాలో నటిస్తున్నాడు. త్వరలోనే ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఇలా ఉండగా హృతిక్ ఎంతో ముచ్చటపడి బొంబాయ్ బీచ్ కు దగ్గరలో ఓ ఇంటిని కట్టించుకున్నాడు. హృతిక్ టేస్ట్ కు దగ్గరగా ఉండేలా ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అశీష్ షా ఈ ఇంటిని నిర్మించినట్లు తెలుస్తోంది. లివింగ్ రూమ్, హాల్, డైనింగ్ హాల్, కిడ్స్ రూమ్, ఆఫీస్ రూమ్ ఇంట్లోనే థియేటర్ ఇలా దేనికదే ప్రత్యేకంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ ఇంటి గురించి తెలుసుకున్న హృతిక్ సన్నిహితులు ఇంటిని చూడడానికి ఒకరితర్వాత ఒకరు క్యూ కడుతున్నారట. కట్టించుకుంటే ఇలాంటి ఇంటినే కట్టించుకోవాలని మాట్లాడుకుంటున్నారు. నిజానికి హృతిక్ మాజీ భార్య సుస్సాన్ కూడా ఫేమస్ ఇంటీరియర్ వీరిద్దరు కలిసే ఉంటే తనతోనే ఇంటీరియర్ డిజైనింగ్ చేయించి ఉండేవాడు. సుస్సాన్ ప్రస్తుతం రణభీర్ కపూర్ కొత్త ఇంటికి హంగులు దిద్దే పనిలో ఉంది.
.jpg)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



