ముద్దుల బాలయ్య
on Apr 21, 2015
.jpg)
ఎప్పుడూ తొడకొట్టడం, మీసం తిప్పడమేనా? కూసింత కళాపోషన ఉండొద్దూ అంటున్నాడట నందమూరి నటసింహం. బాలయ్యకి కళాపోషన లేదా ఏం మాట్లాడుతున్నారు అంటారా? మే మాట్లాడుతున్నది ఆన్ స్క్రీన్ సంగతి లెండి. నందమూరి అభిమానుల కోసం తన లేటెస్ట్ మూవీ లయన్ లో కాస్త రొమాంటిక్ డోస్ పెంచాడట బాలయ్య. సింహా, లెజెండ్ కాస్త రొమాంటిక్ గా కనిపించిన ఈ సీనియర్ హీరో....లయన్ లో త్రిష అధరామృతాన్ని రుచిచూశాడట. లయన్ టీజర్ సాంగ్ లో త్రిష పెదాలను బాలయ్య పట్టుకునే సీన్ ఇందుకు ఊతమిస్తోందంటున్నారు. అంతేకాదు....బాలయ్య-త్రిష మధ్య రొమాంటిక్ సీన్స్ ఊహకందని రేంజ్ లో ఉంటాయనే ప్రచారమూ జరుగుతోంది. ప్రస్తుతం ప్రజాప్రతినిధి కాబట్టి ఇలాంటి సీన్స్ ఉండవని కొంతమంది అంటున్నారు. మరి ఎవరి మాటల్లో నిజమెంతో మే 1 న తేలిపోతుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



