అంజలి బాగా పెంచేసింది
on Dec 8, 2014
సాధారణంగా హిట్ వస్తే హీరో హీరోయిన్లు తమ పారితోషికాలను పెంచేస్తుంటారు. అయితే నటి అంజలి మాత్రం ప్రస్తుతం సక్సెస్ లేకున్నా తన పారితోషికాన్ని పెంచాలని నిర్ణయించుకోవడం విశేషం. గీతాంజలి తరవాత ఈ తెలుగమ్మాయి తెరపై కనిపించలేదు. అటు తమిళంలోనూ అమ్మడికి అవకాశాల్లేకుండా పోయాయి. అంజలి కెరీర్ ఏమైపోతోందో అనుకొంటున్న తరుణంలో ఆమెకు మరో అవకాశం వచ్చింది. అయితే ఇది అలాంటిలాంటి అవకాశం కాదు.. అనుష్క స్థాయి కథానాయిక చేయాల్సిన పాత్ర అంజలి పాపని వెదుక్కొంటూ వచ్చింది. అయితే ఈ సినిమా కోసం అంజలి ఏకంగా రూ.75 లక్షల పారితోషికం డిమాండ్ చేసి నిర్మాతల్ని కంగారుపెట్టేసిందట. ఈసినిమా కోసం అంజలి కాస్త స్లిమ్ అవుతోంది. డైటింగ్ చేస్తోంది. ఈ విషయాల్నీ దృష్టిలో పెట్టుకోండి అంటోందట. చేసేదేం లేక నిర్మాతలు కూడా ఓకే అన్నారట.