ఆంధ్రాపోరి కుర్రాడు మహేశ్ ని పాలో అవుతున్నాడా?
on Jun 5, 2015
పూరీ తనయుడు సూపర్ స్టార్ తనయుడిని ఫాలో అవుదాం అనుకుంటున్నాడట. మహేశ్ బాబుకి -ఆకాశ్ కి పోలికేంటి అంటారా?. విషయంలోకి వెళితే ఆంధ్రాపోరితో వచ్చిన ఆకాశ్ మరో మూడేళ్ల వరకూ హీరోగా కనిపించేది లేదన్నాడట. బ్యాక్ గ్రౌండ్ చూసుకుని రంగంలోకి దూకేసిన పూరీ తనయుడు ఎందుకిలా మాట్లాడుతున్నాడని ఆరాతీస్తే...సత్యం తెలుసుకున్నా అంటున్నాడట. ఏదో ఉత్సాహం కొద్దీ హీరోగా వచ్చాడు కానీ ఇంకా పిల్లాడి ఛాయలు పోనేలేదు. పైగా హీరోగా అస్సలు సెట్టవలేదు. ఇలాంటప్పుడు అత్యుత్సాహానికి పోయి అతిచేసేకన్నా కాస్త రెస్ట్ తీసుకుని రావడం బెస్టని ఫిక్సయ్యాడట. సరిగ్గా ఈ విషయంలోనే మహేశ్ బాబుని ఫాలోఅవుతున్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మహేశ్ బాబుసైతం బాలనటుడిగా వచ్చి కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత రాజకుమారుడుతో ఫ్రెష్ గా ఎంట్రీ ఇచ్చాడు. అదే తరహాలో బాలనటుడిగా మెప్పించిన ఆకాశ్....ఆంధ్రాపోరి తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకుని తండ్రి దర్శకత్వంలోనే ఎంట్రీ ఇస్తానంటున్నాడు. మరి మహేశ్ ని ఫాలో అవుతున్న ఆకాశ్ వ్యూహం ఫలిస్తుందా? వెయిట్ అండ్ సీ!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
