లిప్‌స్టిక్‌తో రజనీ ముఖంపై పెయింటింగ్ వేసిన లత!
on Nov 5, 2021

రజనీకాంత్, లత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు.. ఐశ్వర్య, సౌందర్య. రజనీ ఎక్కడకు వెళ్లినా వెంట భార్య కానీ కుమార్తెలు కానీ తప్పకుండా ఉంటారు. 1980లో ఒక సినిమా షూటింగ్ సెట్స్‌పై రజనీ ఉన్నప్పుడు తన కాలేజీ మ్యాగజైన్ కోసం ఇంటర్వ్యూ నిమిత్తం ఆయనను తొలిసారి కలిశారు లత. ఆ ఇంటర్వ్యూ సందర్భంగా తమ అభిరుచులు దాదాపు ఒకటే అని వారు గ్రహించారు. ఇంటర్వ్యూ అయ్యాక పెళ్లి ప్రపోజల్ చేశారు రజనీ.
ఊహించని ఆ ప్రపోజల్‌కు మొదట షాకై, ఆ తర్వాత ఆనందపడి, తన పేరెంట్స్‌తో మాట్లాడాలని చెప్పారు లత. ఇండస్ట్రీలోని ప్రముఖుల చేత లత తల్లితండ్రులతో మాట్లాడించారు రజనీ. చివరకు వారు అంగీకరించడంతో 1981 ఫిబ్రవరి 26న తిరుపతిలో లత మెడలో మూడు ముళ్లు వేసి, తనదాన్నిగా చేసుకున్నారు.
అంటే వారి పెళ్లయి నాలుగు దశాబ్దాలు దాటాయన్న మాట. వారి పెళ్లిరోజు సందర్భంగా ఒకసారి పెద్ద కుమార్తె ఐశ్వర్య, తన తల్లితండ్రులకు సంబంధించిన ఒక మెమరబుల్ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. ఆ ఫొటోలో రజనీ ముఖంపై తన రెడ్ కలర్ లిప్‌స్టిక్‌తో లత పెయింటింగ్ వేస్తున్నారు. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫొటో చూస్తే చాలు.. రజనీ, లత ఎంత సరదాగా, ఎంత అన్యోన్యంగా దాంపత్య జీవితాన్ని గడుపుతున్నారో అర్థమైపోతుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



