డబ్బులిస్తేనే గానీ శోభన్‌బాబు షూటింగ్‌కి వచ్చేవారు కాదు. ఎందుకో తెలుసా?
on Jan 31, 2024
కొందరికి నటన హాబీ, మరికొందరికి అదే జీవనాధారం. కొంతమంది నటీనటులు కోటీశ్వరుల కుటుంబాల నుంచి వచ్చినప్పటికీ నటనపై తమకు ఉన్న ఆసక్తి కారణంగానే సినిమా రంగంలో స్థిరపడుతుంటారు. సినిమాలే జీవనాధారంగా ఇండస్ట్రీకి వచ్చినవారు తొలినాళ్ళలో డబ్బుకు ఎంతో ఇబ్బంది పడేవారు. చాలీ చాలని డబ్బుతో జీవనం సాగించేవారు. ఆ తర్వాత నటుడిగానో, నటిగానో నిలదొక్కుకున్న తర్వాత కూడా అదే పద్ధతిని పాటించేవారు. అలాంటి కష్టాల గురించి తెలిసిన కొందరు మాత్రం తమ నిర్మాతల పట్ల, దర్శకుల పట్ల ఎంతో ఉదారంగా వ్యవహరించేవారు. అలాంటి వారు ఇండస్ట్రీలో తక్కువనే చెప్పాలి. ఎక్కువ శాతం డబ్బు దగ్గర ఎంతో నిక్కచ్చిగా ఉంటారు. అలాంటి వారిలో శోభన్‌బాబు ఒకరు.
తొలినాళ్ళలో శోభన్‌బాబు కూడా డబ్బుకు ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. అతను హీరోగా నిలదొక్కుకున్న తర్వాత రెమ్యునరేషన్ విషయంలో ఎంతో కఠినంగా వ్యవహరించేవారని చెప్పుకునేవారు. డబ్బు చేతిలో పడితేనేగానీ షూటింగ్‌కి వచ్చేవారు కాదనే మాట ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. నిర్మాత ఇస్తానన్న డబ్బు టైమ్‌కి అందకపోవడం వల్ల షూటింగ్‌కి వెళ్ళని సందర్భాలు కూడా శోభన్‌బాబు కెరీర్‌లో ఉన్నాయని చెబుతారు. అయితే ఆయన డబ్బు విషయంలో అంత ఖచ్చితంగా ఉండడానికి గల కారణం ఏమిటనే విషయం గురించి కొందరు సీనియర్ నటుల దగ్గర ప్రస్తావించినపుడు.. దానికి వారు చెప్పిన సమాధానం వింటే ఆశ్చర్యం కలగక మానదు.
శోభన్‌బాబు తన కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సంపాదించిన ప్రతి రూపాయిని భూమిపైనే పెట్టేవారనే విషయం చాలా మందికి తెలుసు. అలా ఎంతో భూమిని ఆయన కొనుగోలు చేశారు. దానికి కూడా ఒక లెక్క ఉండేది. శోభన్‌బాబు ఒక సినిమా ఒప్పుకున్నారంటే.. దానికి ఎంత రెమ్యునరేషన్ వస్తుంది, దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చెయ్యాలి, ఎప్పుడెప్పుడు ఎంతెంత కట్టాలి అనే విషయాలని ఒక నోట్‌బుక్‌లో రాసుకునేవారు. షూటింగ్‌కి కూడా ఆ నోట్‌బుక్ తెచ్చుకునేవారు. షాట్ బ్రేక్‌లో తను రాసుకున్న వివరాలను పదే పదే చూసుకునేవారు. ఒక సినిమాకి సంబంధించి తనకు రావాల్సిన రెమ్యునరేషన్ అనుకున్న టైమ్‌కి, అనుకున్నంత వస్తేనే షెడ్యూల్ ప్రకారం తను కొన్న భూమికి డబ్బు చెల్లించగలుగుతారు. అందుకే ఆ విషయంలో ఎంతో ఖచ్చితంగా ఉండేవారు. ఎవరేమనుకున్నా సరే.. తన పద్ధతిని మాత్రం చివరి వరకు మార్చుకోలేదు. అందుకే డబ్బు అందితేనే శోభన్‌బాబు షూటింగ్‌కి వస్తాడనే ప్రచారం అప్పట్లో బాగా జరిగింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
