ఫ్లాష్ బ్యాక్ః సుమన్ కి మూడు సార్లు కలిసొచ్చిన మే 30!
on May 30, 2022

తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించిన అందాల నటుల్లో సుమన్ ఒకరు. 80, 90ల్లో సుమన్ కథానాయకుడిగా నటించిన పలు చిత్రాలు విజయపథంలో పయనించాయి. వాటిలో `20వ శతాబ్దం`, `పెద్దింటల్లుడు`, `నాయుడు గారి కుటుంబం` వంటి సినిమాలు కూడా ఉన్నాయి. 90ల్లో జనం ముందు నిలిచిన ఈ మూడు చిత్రాలకు సంబంధించి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. అదేమిటంటే.. ఈ మూడు జనరంజక సినిమాలు కూడా వేర్వేరు సంవత్సరాల్లో ఒకే తేదిన సందడి చేశాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ కాంబినేషన్ లో సుమన్ నటించిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ `20వ శతాబ్దం`.. 1990 మే 30న విడుదలైంది. ``అమ్మను మించిన దైవమున్నదా`` అనే పాపులర్ సాంగ్ ఈ సినిమాలోనిదే. ఇక ఇదే మే 30న 1991లో సుమన్ నుంచి మరో చిత్రం వచ్చింది. అదే.. `పెద్దింటల్లుడు`. ఒకప్పటి అగ్ర కథానాయిక నగ్మా నటించిన తొలి తెలుగు చిత్రమిది. శరత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వాణిశ్రీ, మోహన్ బాబు ఇతర ప్రధాన పాత్రల్లో ఆకట్టుకున్నారు. ఇక సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థలో సుమన్ నటించిన సక్సెస్ ఫుల్ మూవీ `నాయుడు గారి కుటుంబం` కూడా 1996లో ఇదే మే 30న రిలీజైంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు ఓ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని బోయిన సుబ్బారావు డైరెక్ట్ చేశాడు. మొత్తమ్మీద.. మే 30న ఆరేళ్ళ వ్యవధిలో ముచ్చటగా మూడు హిట్స్ చూసి వార్తల్లో నిలిచారు సుమన్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



