మోహన్ బాబు 'అగ్ని జ్వాల'కి 40 ఏళ్ళు!
on Jul 14, 2023

కెరీర్ ఆరంభంలో ఒకవైపు విభిన్న పాత్రలుచేస్తూనే.. మరోవైపు కథానాయకుడిగానూ ఎంటర్టైన్ చేశారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. అలా.. హీరోగా సందడి చేసిన సినిమాల్లో 'అగ్ని జ్వాల' ఒకటి. బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మోహన్ బాబుకి జంటగా కవిత నటించగా.. నరేశ్, ముచ్చర్ల అరుణ, జయంతి, అన్నపూర్ణ, సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, గిరిబాబు, అల్లు రామలింగయ్య, త్యాగరాజు, సుత్తి వీరభద్ర రావు, సుత్తి వేలు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. ఎం.డి. సుందర్ స్క్రీన్ ప్లే సమకూర్చగా.. సత్యానంద్ సంభాషణలు సమకూర్చారు.
సత్యం సంగీతమందించిన ఈ చిత్రానికి వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యమందించారు. ఇందులోని "ముసుగులో గుద్దులాట", "కోయ్ కోయ్ సొరకాయ కోత కోయ్" అంటూ సాగే పాటలు ఆకట్టుకున్నాయి. జీవీకే కంబైన్స్ పతాకంపై జీవీ కృష్ణారావు బీఏ ఈ చిత్రాన్ని నిర్మించారు. 1983 జూలై 14న జనం ముందు నిలిచిన 'అగ్ని జ్వాల'.. నేటితో 40 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



