పవన్ కళ్యాణ్ రీమేక్స్ లో ఆ హీరోవే ఎక్కువ.. ఇంతకీ ఎవరా స్టార్!?
on Aug 23, 2023
తెలుగునాట రీమేక్స్ అనే మాట వినగానే గుర్తొచ్చే కథానాయకుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. తన తొలి చిత్రం 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' నుంచి రీసెంట్ మూవీ 'బ్రో' వరకు పవన్ మొత్తం 28 చిత్రాల్లో సందడి చేశారు. వాటిలో 13 సినిమాలు వేరే భాషల్లో విజయం సాధించిన చిత్రాలకి రీమేక్ వెర్షన్స్ కావడం విశేషం.
ఇక పవన్ కళ్యాణ్ ఏ స్టార్ హీరో నటించిన సినిమాలను ఎక్కువగా రీమేక్ చేశారు? అంటే మాత్రం ఠక్కున వచ్చే సమాధానం.. కోలీవుడ్ హీరో దళపతి విజయ్. పవన్ కి యువతలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిన 'సుస్వాగతం' (1998) విజయ్ నటించిన సక్సెస్ ఫుల్ మూవీ 'లవ్ టుడే' (1997)కి తెలుగు వెర్షన్. అలాగే పవర్ స్టార్ స్థాయిని అమాంతం పెంచేసిన 'ఖుషి' (2001) కూడా విజయ్ 'ఖుషి' (2000) ఆధారంగానే తెరకెక్కింది. అయితే, 'ఖుషి' కథ మొదట పవన్ కళ్యాణ్ నే విన్నా.. ఫస్ట్ తెరపైకి వచ్చింది మాత్రం తమిళ్ 'ఖుషి'నే. సో.. అలా 'ఖుషి' కూడా రీమేక్ బాటలో సాగినట్లయ్యింది. అలాగే పవన్ 'అన్నవరం' (2006) కూడా విజయ్ నటించిన 'తిరుప్పాచ్చి' (2005) చిత్రానికి రీమేక్ రూపమే. మొత్తమ్మీద.. విజయ్ నటించిన మూడు తమిళ చిత్రాలను పవన్ రీమేక్ చేశారు. వీటిలో 'సుస్వాగతం', 'ఖుషి' ఘన విజయం సాధించాయి. 'అన్నవరం' మాత్రం యావరేజ్ గ్రాసర్ గా నిలిచింది.
Also Read