బాహుబలి లాంటి సినిమాని బాలీవుడ్ తెరకెక్కించగలదా!
on Oct 27, 2025

- బాలీవుడ్ కి ఏమైంది?
- భారతీయ చిత్ర పరిశ్రమ ఎవరిది?
- బాహుబలి ని బాలీవుడ్ తెరకెక్కించగలదా!
భారతీయ చిత్ర పరిశ్రమ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు హిందీ చిత్ర పరిశ్రమ. కాకపోతే ఈ డైలాగ్ పాతదయిపోయి జమానా కాలం దాటింది. హిందీ చిత్రరంగం ప్లేస్ లోకి తెలుగు సినిమా వచ్చి చేరింది. ఇందుకు ప్రధాన కారణం మన తెలుగు దర్శకులు తమ మేధస్సుతో సిల్వర్ స్క్రీన్ పై సరికొత్త కథలకి అంకురార్పణ చేయడమే. దీంతో భారతీయ సినిమాకి కేర్ ఆఫ్ అడ్రస్స్ గా తెలుగు సినిమా చేరుకుంది. బాహుబలి పార్ట్ 1 ,పార్ట్ 2 ,ఆర్ఆర్ఆర్, పుష్ప పార్ట్ 1 ,పార్ట్ 2 , కార్తికేయ 2 , కాంతార, కాంతార చాప్టర్ 1(Kantara Chapter 1)చిత్రాలే ఉదాహరణ. ఇక ఈ నెల 31 న బాహుబలి(Baahubali)రెండు భాగాలు కలిపి ఒకే భాగంగా రీ రిలీజ్ కాబోతుంది. దీంతో హిందీ చిత్ర పరిశ్రమ తెలుగు సినిమా స్థాయిలోకి వచ్చే అవకాశం ఉందా అనే చర్చ మరోసారి సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది.
హిందీ చిత్ర పరిశ్రమ ప్రారంభం నుంచే కథ, కథనం విషయంలో ఎప్పటికప్పుడు నూతన ఒరవిడిని సృష్టిస్తూ ముందుకెళ్ళేది. సదరు చిత్రాలు బడ్జెట్ పరంగాను, టెక్నికల్ గాను ఎంతో ఉన్నతంగా ఉండేవి. జోనర్స్ పరంగా కూడా అన్ని జోనర్స్ కి సంబంధించిన కథల్ని ప్రేక్షకులు మైమరిచిపోయేలా తెరకెక్కించేవాళ్ళు. అందమైన పాటలతో పాటు కాస్టింగ్ పరంగాను సంచలనం సృష్టించాయి. ఆయా చిత్రాలని చూసి తెలుగుతో పాటు దక్షిణ భారతీయ మేకర్స్ కూడా ఇన్ స్పైర్ చెందే వారు. మూవీ లవర్స్ కూడా హిందీ సినిమా చూశామని గర్వంతో తమ వారికి చెప్పుకుని మురిసిపోయేవారు. అంతటి చరిష్మా బాలీవుడ్ సినిమా సొంతం. కానీ హిందీ చిత్ర పరిశ్రమ చాలా ఏళ్ళ నుంచి తన ఉనికిని భారతీయ సినీ యవనికపై చాటడంలో విఫలమవుతుంది. ఈ పరిస్థితుల్లో ఏమైనా మార్పు వస్తుందని అనుకున్నా కూడా ఎప్పటికప్పుడు నాసిరకం సినిమాలు వస్తూనే ఉన్నాయి.
Also read: వివాదంలో ఆది.. క్షమాపణలు చెప్పాలని ఫ్యాన్స్ డిమాండ్
ఈ విషయంలో హిందీ సినీ రంగ ప్రేమికులు ఎంతగానో ఆందోళన చెందుతున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలు ఎప్పటికప్పుడు టెక్నాలజీ పరంగా, సబ్జెట్స్ పరంగా ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కుతున్నాయి. సదరు చిత్రాలు బాలీవుడ్ లో సైతం ఊహించని రీతిలో అక్కడి చిత్రాలకి కూడా దక్కని విధంగా కలెక్షన్స్ సాధిస్తున్నాయి. దీంతో హిందీ చిత్రపరిశ్రమ, తెలుగు చిత్ర పరిశ్రమని బీట్ చేయగలదా అని పలువురు బాలీవుడ్ సినీ పండితులే సోషల్ మీడియా వేదికగా తమ డౌట్ ని వ్యక్తం చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



