షారుక్ ఖాన్ తో గొడవపై స్పందించిన సన్నీడియోల్
on Apr 10, 2025
బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీడియోల్(Sunny Deol)ఈ రోజు'జాట్'(Jaat)అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.పక్కాయాక్షన్ డ్రామా ఫిలింగా తెరకెక్కిన'జాట్'ని మైత్రి మూవీ మేకర్స్ భారీ వ్యయంతో నిర్మించింది.గోపీచంద్ మలినేని(Gopichand Malineni)దర్శకత్వం వహించగా థమన్(Thaman)సంగీతాన్ని అందించాడు.మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సన్నీడియోల్ పలు రకాల ఇంటర్వ్యూలు ఇస్తు ఉన్నాడు.ఈ క్రమంలోనే రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో 32 సంవత్సరాల క్రితం'డర్' మూవీ సందర్భంగా తన మధ్య,బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్(Shah Rukh Khan)మధ్య జరిగిన మనస్పర్దలపై స్పందించడం జరిగింది.
సన్నీడియోల్ మాట్లాడుతు'డర్'సినిమా విషయంలో జరిగిన సంఘటనపై నేను ఏ మాత్రం బాధపడటం లేదు.అది గడిచిపోయిన కాలం.ఏది తప్పో ఏది ఒప్పో ఆ తర్వాత అందరకి అర్ధమయ్యింది.కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాటి గురించి మాట్లాడి ఉపయోగం లేదు.వాటినే ఆలోచిస్తు కూర్చుంటే ముందుకి వెళ్లలేం కదా.నాకు చాలా మంది సహానటులతో మల్టీస్టారర్ చెయ్యాలని ఉంది.అందులో షారుఖ్ కూడా ఒకడని చెప్పుకొచ్చాడు.
ఇక 'డర్'మూవీ వివాదంలోకి వస్తే బాలీవుడ్ అగ్ర దర్శకుడు యష్ చోప్రా(Yash Chopra)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో సన్నీడియోల్ ప్రధాన పాత్రలో కనపడగా షారుక్ కీలక పాత్రలో కనిపించాడు.కాకపోతే మూవీలో సన్నీడియోల్ రోల్ కంటే షారుక్ రోల్ ని ఎక్కువగా హైలెట్ చేసి చూపించారు.దీంతో అప్పట్నుంచి షారుక్, సన్నీడియోల్ మధ్య మాటలు లేవు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
