భార్యకి క్యాన్సర్, నాలుగు సర్జరీలు.. రియల్ ఫ్యామిలీ మ్యాన్ అనిపించుకున్న షరీబ్
on Dec 16, 2025

-షరీబ్ సినీ ప్రయాణం తెలుసా!
-భార్య ఎవరు!
-ఆమె పాత్ర ఏంటి
సమంత భర్త రాజ్ దర్శకత్వంలో వచ్చిన ''ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ ఇండియా వ్యాప్తంగా అన్ని భాషా ప్రేమికులని ఎంతగానో అలరించింది. మనోజ్ బాజ్‌పాయ్, సమంత కి ఎంత పేరు వచ్చిందో జయవంత్ కాశీనాధ్ క్యారక్టర్ ని పోషించిన షరీబ్ హష్మి కి కూడా అంతే పేరు వచ్చింది. సదరు క్యారక్టర్ లో తనదైన కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించాడు. మిగతా రెండు సిరీస్ లోను కూడా తగ్గేదెలా అనే విధంగా నటించి తన అభిమాన గణాన్ని పెంచుకున్నాడు. రీసెంట్ గా సోషల్ మీడియాలో షరీబ్ కేవలం ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో తన తన నటనతో మెప్పించడమే కాదు, నిజ జీవితంలోను రియల్ ఫ్యామిలీ మ్యాన్ అనిపించుకున్నాడంటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన న్యూస్ చక్కర్లు కొడుతుంది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం.
షరీబ్ భార్య పేరు నస్రీన్ (Nasreen). 2003లో షరీబ్,నస్రీన్ కి మ్యారేజ్ జరిగింది. అప్పటికి ఇద్దరికి వయసు 18, 19 ఏళ్లే. సినీ రాజధాని ముంబయిలో వైవాహిక జీవితాన్నిప్రారంభించారు. షరీబ్ ఒక టెలివిజన్ ఛానల్‌లో పని చేస్తూ నటనపై మక్కువతో సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేసే వాడు. ఆ తర్వాత కొంత కాలానికి ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమాలపై పూర్తిగా దృష్టి పెట్టాడు. కొడుకు కూడా పుట్టి ఉండటంతో నస్రీన్ కుటుంబ బాధ్యతను భుజానికెత్తుకుంది.
చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకురావడమే కాకుండా షరీబ్ కి ఆర్ధికంగా అన్ని విధాలుగా అండగా ఉండేందుకు తన బంగారాన్ని, ఇంటికి కూడా అమ్మేసింది.ఇక ఆ తర్వాత కొన్నాళ్ళకి స్లమ్‌డాగ్ మిలియనీర్’, ‘హాల్ ఇ దిల్’ వంటి చిత్రాల్లో షరీబ్ కి చిన్న చిన్న క్యారక్టర్ లలో అవకాశాలు వచ్చాయి.అలా ఒకవైపు సినిమాలు, మరోవైపు టీవీ సీరియల్స్ షార్ట్ ఫిల్మ్స్ ఇలా ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ముందుకు వెళ్ళాడు.ఇక సినీ కెరీర్ ఊపందుకుంటున్న సమయంలో నస్రీన్ కి ఓరల్ క్యాన్సర్ అనే విషయం బయటపడింది.
also read: రెండో పెళ్లి కూడా పెటాకులేనా! పాపం ఆ డైరెక్టర్!
ఊహించని ఆ వార్తతో ఇద్దరు ఎంతో ఆవేదన చెందారు. నాలుగైదు సర్జరీలు అవ్వడంతో పాటు కీమో థెరపీ కూడా చేసారు. కష్ట సమయంలో తనతో పాటు, కుటుంబాన్ని మోసిన నస్రీన్ కోసం షరీబ్ తన శక్తినంతటినీ ధారపోశాడు. షరీబ్ ధైర్యం, నస్రీన్ సంకల్పం క్యాన్సర్ మహమ్మారిని ఎదుర్కొనేలా చేశాయి.నాలుగుసార్లు క్యాన్సర్ ఆపరేషన్ జరిగినా ప్రతి సర్జరీ తర్వాత కొంత విశ్రాంతి తీసుకుని నస్రీన్ ఉద్యోగానికి వెళ్ళేది.
సర్జరీలు కారణంగా ఆమె శరీరం, ముఖ ఆకృతి పూర్తిగా మారిపోయింది. తనకు ఎదురైన ప్రతి సవాల్ స్వీకరించడమే కాదు, ధైర్యంగా ఎదుర్కొంది. ఈ పోరాటంలో హష్మి ఆమె వెన్నంటే ఉండి నడిపించాడు. ఫలితం హష్మి, నస్రీన్ గెలిచారు. క్యానర్స్ ఓడిపోయింది. 2022 తర్వాత నస్రీన్ క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకుంది.ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఫ్యామిలీ మ్యాన్ ఇచ్చిన ఉత్సాహంతో సినీ రంగంలోను షరీబ్ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. మల్హర్, ది డిప్లమేట్, మర్డర్ బాద్ , గుస్తాఖ్ ఇష్క్ ,వంటి చిత్రాల్లో ప్రాముఖ్యత గల పాత్రలు పోషించాడు. ఈ ఏడాది i కూడా పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో చేస్తున్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



