ఇండియన్ సెలబ్రిటీల్లో నెంబర్ వన్ షారూక్.. అతని తర్వాతే ఎవరైనా!
on Sep 6, 2024
1988లో టెలివిజన్ సిరీస్‌తో యాక్టింగ్ కెరీర్‌ని ప్రారంభించిన షారూక్ ఖాన్ 1992లో హీరోగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు. 1993లో వచ్చిన బాజీగర్ అతని కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ అయింది. ఇక అక్కడి నుంచి వరసగా సినిమాలు చేస్తూ బాలీవుడ్‌లో టాప్ స్టార్‌గా ఎదిగారు. 58 ఏళ్ళ వయసులోనూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. గత ఏడాది పఠాన్, జవాన్ వంటి బ్లాక్‌బస్టర్స్‌తో కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించారు. ఎన్ని సినిమాలు చేసినా, రెమ్యునరేషన్ ఏ స్థాయిలో ఉన్నా ఆదాయపు పన్ను విషయంలో షారూక్ ఎప్పుడూ అలర్ట్‌గా ఉంటారు. తను చెల్లించాల్సిన పన్ను సకాలంలో చెల్లిస్తూ ఇతర సెలబ్రిటీలకు ఆదర్శంగా నిలుస్తుంటారు. తాజాగా 2023`24 సంవత్సరానికిగాను ఆదాయ పన్నులు చెల్లించిన సెలబ్రిటీలకు సంబంధించి టాప్ 20 జాబితాను పార్చ్యూన్ ఇండియా మ్యాగజైన్ విడుదల చేసింది. ఇందులో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నెంబర్ వన్ స్థానంలో నిలిచారు.
క్రికెటర్లకు ఎంత ఆదాయం ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక విరాట్ కోహ్లి వంటి స్టార్ బ్యాట్స్‌మెన్ ఆదాయం గురించి ప్రత్యేకంగా చెపక్కర్లేదు. ఒక పక్క మ్యాచ్‌ల ద్వారా, మరో పక్క కమర్షియల్ యాడ్స్ ద్వారా విరాట్ ఆదాయం ఎంత ఉంటుందో ఊహించడం కూడా కష్టం. అలాంటిది అతను ఆదాయ పన్ను చెల్లించడంలో ఐదో స్థానంలో ఉండడం అందర్నీ ఆశ్చర్యపరచింది. మిగతా క్రికెటర్ల విషయానికి వస్తే.. ఎం.ఎస్.ధోని, సచిన్ టెండూల్కర్ తప్ప ఎవరూ టాప్ టెన్‌లో లేరు.
షారూక్ ఈ సంవత్సరం రూ.92 కోట్లు పన్ను చెల్లించారు. ఆ తర్వాతి స్థానంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ ఉన్నారు. విజయ్ రూ.80 కోట్లు టాక్స్ కట్టారు. రూ.75 కోట్లతో సల్మాన్ ఖాన్ మూడో స్థానంలో నిలిచారు. అమితాబ్ బచ్చన్ రూ.71 కోట్లు పన్ను చెల్లించి నాలుగో స్థానంలో, రూ.66 కోట్లతో విరాట్ కోహ్లి ఐదో స్థానంలో ఉన్నారు. రూ.42 కోట్లతో ఆరో స్థానంలో అజయ్ దేవ్‌గణ్, రూ.38 కోట్లతో ఎం.ఎస్.ధోని ఏడో స్థానంలో ఉండడం విశేషం. ఆ తర్వాత రణబీర్ సింగ్, హృతిక్ రోషన్, సచిన్ టెండూల్కర్ టాప్ టెన్‌లో ఉన్నారు.
మిగతా స్థానాల్లో కపిల్ శర్మ రూ.26 కోట్లు, సౌరభ్ గంగూలీ రూ.23 కోట్లు, షాహిద్ కపూర్ రూ.14 కోట్లు, మోహన్ లాల్ రూ.14 కోట్లు, అల్లు అర్జున్ రూ.14కోట్లు, హార్దిక్ పాండ్యా రూ.13 కోట్లు, కియారా అద్వానీ రూ.12కోట్లు, కత్రినా కైఫ్ రూ.11 కోట్లు, పంకజ్ త్రిపాఠి రూ.11 కోట్లు, అమిర్ ఖాన్ రూ.10 కోట్లు, రిషబ్ పంత్ రూ.10 కోట్లు చెల్లించి టాప్ 20లో ఉన్నారు.
Also Read