కత్రినా-విక్కీ రాయల్ వెడ్డింగ్ వెనుక ఉన్న బ్యాచ్ ఇదే!
on Dec 7, 2021
వెడ్డింగ్ ప్లానింగ్ అనేది కేక్వాక్ కాదు, ప్రత్యేకించి ఈ ఏడాది పెళ్లిగా అందరూ అభివర్ణిస్తోన్న, వరల్డ్ మీడియా దృష్టి ఉన్న కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ వెడ్డింగ్ ఈవెంట్‌ను ప్లాన్ చేయడం అంత ఈజీకాదు. ఆ బాధ్యతను తలకెత్తుకుంది 'షాదీ స్క్వాడ్'. ప్రతిష్ఠాత్మకంగా, అదే సమయంలో ప్రైవేట్‌గా తమ పెళ్లి జరగాలని కోరుకొనే జంటలు ఇప్పుడు షాదీ స్క్వాడ్ వైపే చూస్తున్నారు.
Also read: ఈ లోకం నీకు తుపాకి ఇచ్చింది.. నాకు గొడ్డలి ఇచ్చింది.. 'పుష్ప' ట్రైలర్ బెస్ట్ మూమెంట్స్!
అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ డ్రీమీ వెడ్డింగ్‌ను ఆర్గనైజ్ చేసిందీ, ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ ఎంగేజ్‌మెంట్‌ను పర్ఫెక్షన్తో ఎగ్జిక్యూట్ చేసిందీ, వరుణ్ ధావన్-నటాషా దలాల్ పెళ్లి వేడుకను, రాజ్‌కుమార్ రావ్-పత్రలేఖ ఇంటిమేట్ వెడ్డింగ్ ఈవెంట్‌ను డిజైన్ చేసిందీ షాది స్క్వాడ్. ఇప్పుడు దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ వెడ్డింగ్ అరేంజ్మెంట్స్లో ఆ వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీ తలమునకలై ఉంది. డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో జరుగుతున్న ఆ ఈవెంట్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు ఆ కంపెనీ అన్ని ఏర్పాట్లూ చేస్తోంది.
Also read: 'అఖండ'లో మెయిన్ విలన్ రియల్ లైఫ్‌లో మాజీ ఆర్మీ ఆఫీసర్ అని మీకు తెలుసా?
షాదీ స్వ్కాడ్ ముంబైకి చెందిన ఒక స్టార్టప్ కంపెనీ. 2015లో ఈ న్యూ ఏజ్ వెడ్డింగ్ ప్లానర్ కంపెనీని టీనా తర్వాణి, సౌరభ్ మల్హోత్రా, మనోజ్ మిత్రా కలిసి ఏర్పాటు చేశారు. నేటి కాలపు జంటలకు తమ జీవితంలో మరపురాని రోజుగా పెళ్లిరోజును మలచడంలో తమ వంతు తోడ్పాటును అందిస్తున్నామని వారంటున్నారు. పెళ్లి వేడుక ఎలా జరుగుతుందనే విషయాన్ని ముందుగా బయటకు పొక్కకుండా, చాలా జాగ్రత్తగా ఈవెంట్‌ను నిర్వహించడం, రకరకాల అంశాలతో ఆ వేడుకను కన్నులపండువగా మలచడం, మొత్తంగా వధూవరులకు తమది డ్రీమ్ వెడ్డింగ్ అనే ఫీలింగ్ కలిగించడం షాదీ స్క్వాడ్ స్పెషాలిటీ. అందుకే కత్రినా-విక్కీ జోడీ కూడా ఈ వెడ్డింగ్‌ను ఆర్గనైజ్ చేసే పనిని ఆ కంపెనీకే అప్పజెప్పింది.
Also Read