కారులో బాంబ్ పెట్టి పేల్చేస్తా
on Apr 14, 2025
బాలీవుడ్ అగ్ర హీరోల్లో సల్మాన్ ఖాన్(Salman Khan)కూడా ఒకడు. మూడున్నర దశాబ్దాలుగా ఎన్నోహిట్ చిత్రాల్లో నటిస్తు తన నటనతో ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నాడు. కొన్ని నెలల క్రితం ప్రముఖ గ్యాంగ్ స్టార్ లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi)గ్యాంగ్ సల్మాన్ ని చంపుతామని పబ్లిక్ గా స్టేట్ మెంట్ ఇచ్చింది.ఆ సమయంలో ముంబై(Mumbai)లో సల్మాన్ ఇంటి వద్ద ఇద్దరు ఆగంతుకులు కాల్పులు కూడా జరిపారు. దీంతో ముంబై గవర్నమెంట్ సల్మాన్ కి వై ప్లస్ సెక్యూరిటీ ని కూడా నియమించింది.
రీసెంట్ గా మరోమారు సల్మాన్ కి బెదిరింపులు వచ్చాయి. సల్మాన్ చంపుతామని, ఆయన ఇంట్లోకి చొరవడి కాల్పులు జరుపుతామని, లేదంటే కారులో బాంబ్ పెట్టి పేల్చేస్తామని వర్లీ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ కి వాట్స్ అప్ సందేశం వచ్చింది. దీంతో వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యి కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే సల్మాన్ కి బెదిరింపులు రావడం ఇప్పడు కొత్త ఏమి కాదు. చాలా సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాయి. వీటిపై సల్మాన్ కొన్ని రోజుల క్రితం మాట్లాడుతు నాకు 'అల్లా'ఎంత వరకు ఆయుష్షు ఇచ్చాడో అంతవరకు ఈ భూమ్మీద ఉంటానని చెప్పాడు.
ఇక సల్మాన్ ఈద్ కానుకగా మార్చి 30 న తన కొత్త మూవీ 'సికందర్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రష్మిక(Rashmika Mandanna)హీరోయిన్ గా చెయ్యగా తమిళ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించాడు. మూవీలో సల్మాన్ పెర్ ఫార్మెన్స్ కి మంచి పేరు వచ్చినా, అవుట్ డేటెడ్ సబ్జెట్ కావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ టాక్ ని తెచ్చుకుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
