సల్మాన్ ఖాన్ ప్రాణం ఖరీదు ఐదు వందల సంవత్సరాలు
on Oct 19, 2024

సల్మాన్ ఖాన్(salman khan)ప్రాణాలతో బతికి ఉండాలంటే ఐదు కోట్లు ఇచ్చి లారెన్స్ బిష్ణోయ్(lawrence bishnoi)తో సెటిల్ చేసుకోవాలని ముంబై పోలీసులకి వాట్స్ అప్ మెసేజ్ వచ్చిన విషయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.దీంతో పోలీసులు సల్మాన్ కి హై సెక్యూరిటీ ని కల్పించారు. తాజాగా బిష్ణోయ్ గ్యాంగులోని సుఖ అనే షూటర్ ను హర్యానాలోని పానిపట్‌లో అరెస్ట్ చెయ్యడం జరిగింది.
సల్మాన్ ని చంపడమే లక్ష్యంగా బిష్ణోయ్ ఎందుకు ఉన్నాడనే దానిపై కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. సల్మాన్ గతంలో రాజస్థాన్ లో ఒక సినిమా షూటింగ్ కి వెళ్ళినప్పుడు కృష్ణ జింక ని చంపిన కేసులో అరెస్ట్ అయ్యాడు.ఆ సమయంలో కృష్ణ జింక ని చంపి తిన్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి.ఇప్పుడు ఈ కృష్ణ జింక విషయమే సల్మాన్ ప్రాణాల మీదకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది.15 వ శతాబ్దంలో రాజస్థాన్ కి చెందిన చండీశ్వర అనే వైష్ణవ భక్తుడు బిష్ణోయ్ పంత్ అనే థియరీ తో ఒక కొత్త తెగ ని ఏర్పాటు చేసాడు.కృష్ణ జింకని దేవత లాగా భావించే ఈ తెగ ఎవరైనా వాటి జోలికి వస్తే చంపుతారు.అవసరమైతే చనిపోతారు. జంతువులని ప్రేమించడంతో పాటుగా మాంసాహారం తినకుండా నిజాయితీగా బతుకుతుంటారు.సుమారు ఆరు లక్షల మంది ఉన్న ఈ తెగ కృష్ణ జింక ని చంపిన సల్మాన్ ని చంపుతామని గతంలోనే ప్రకటించింది.ఆ తెగలోని ఒకడే లారెన్స్ బొష్ణోయ్. సల్మాన్ టార్గెట్ గా 700 మందితో ముఠా ఏర్పాటు చేసాడు. ప్రస్తుతం జైలులో ఉన్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



