సికందర్ కి ప్రభుత్వం నో పర్మిషన్! అభిమానులకి నిరాశేనా!
on Mar 22, 2025
బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్(Salman Khan)రంజాన్(Ramadan)కానుకగా ఈ నెల 30 న యాక్షన్ థ్రిల్లర్ 'సికందర్'(Sikandar)తో వరల్డ్ వైడ్ గా ల్యాండ్ కానున్నాడు.వరుస విజయాలతో ఇండియన్ టాప్ హీరోయిన్ గా అభిమానుల చేత పిలిపించుకుంటున్న స్టార్ హీరోయిన్ రష్మిక(Rashmika Mandanna)హీరోయిన్ గా చేస్తుండటం గతంలో బాలీవుడ్ లో అమీర్ ఖాన్(Amir khan)తో గజిని ని తెరకెక్కించిన సౌత్ డైరెక్టర్ మురగదాస్(A R Murugadoss)చాలా గ్యాప్ తర్వాత సికందర్ కి చేస్తుండటంతో అంచనాలు పీక్ లో ఉన్నాయని చెప్పవచ్చు.ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు,సాంగ్స్ కూడా అభిమానుల్లో అంచనాలు పెంచేసాయి.
రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ మేకర్స్ పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున ప్రమోషన్స్ నిర్వహించాలని మేకర్స్ భావించారు.కానీ సల్మాన్ కి కొన్ని నెలల క్రితం గ్యాంగ్ స్టార్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి బెదిరింపుల దృష్ట్యా ఈవెంట్స్ కి ప్రభుత్వం నుంచి పర్మిషన్ రాలేదని ఒక ఆంగ్ల పత్రికలో వార్తలు ప్రచురితమయ్యాయి.దీంతో సల్మాన్ ని పబ్లిక్ గా చూడాలని కోరుకున్న అభిమానులకి ఈ న్యూస్ నిరాశని కలిగిస్తుంది.డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ద్వారా సికందర్ కి సల్మాన్ ప్రమోషన్స్ చేస్తాడని తెలుస్తుంది.
రీసెంట్ గా మురుగదాస్ సికందర్ మూవీ గురించి మాట్లాడుతు మూవీలో సల్మాన్ ఎంట్రీ ఎవరు ఊహించని విధంగా మూవీకే ప్రత్యేకంగా నిలుస్తుంది.స్క్రిప్ట్ రాసేటప్పుడే హీరో అభిమానులను పరిగణనలోకి తీసుకుని,సల్మాన్ స్టార్‌డమ్‌ని ప్రతిబింబించేలా రాసాను.ఇంటర్వెల్ సీక్వెన్స్ తో పాటు సెకండ్ ఆఫ్ లో హృదయాన్ని కరిగించే సన్నివేశాలు ఉన్నాయి.క్లైమాక్స్ కూడా హైలెట్ గా నిలుస్తుందని చెప్పుకొచ్చాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
