రంజాన్ కోసం గాయాలు అయినా పర్లేదంటున్న సల్మాన్.. రష్మిక ఏం చేస్తుంది మరి
on Aug 30, 2024
ఇండియన్ చిత్ర పరిశ్రమలో సల్మాన్ ఖాన్(salman khan)అలియాస్ సల్లు భాయ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. మూడున్నర దశాబ్దాల పై నుంచే తన అద్భుతమైన నటనతో అశేష ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నాడు. ఎన్నో సూపర్ హిట్ లు సల్లు భాయ్ ఖాతాలో ఉన్నాయి. రీసెంట్ గా ముప్పై ఐదు సంవత్సరాల క్రితం విడుదలైన మైనే ప్యార్ కియ మూవీని రీ రిలీజ్ చేస్తే మంచి విజయాన్ని అందుకుంది, దీన్ని బట్టి సల్మాన్ కి ఉన్న క్రేజ్ చెక్కు చెదరలేదనే విషయం అర్ధమవుతుంది. తెలుగులో కూడా రీ రిలీజ్ అయ్యి మంచి ప్రేక్షాదరణని పొందింది. ఇక తాజా న్యూస్
ఒకటి సినిమాపట్ల సల్మాన్ కి ఉన్న కమిట్ మెంట్ ని తెలియచేస్తుంది.
సల్మాన్ ప్రెజంట్ సికందర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ముంబై లో వేసిన ఒక భారీ సెట్ లో సల్మాన్ మీద కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. కాకపోతే సల్మాన్ కి గాయం అయ్యిందని, ఆ విషయాన్నీ దాచి పెట్టి మరి షూట్ లో పాల్గొంటున్నాడని బిటౌన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇందుకు నిదర్శనంగా తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌లో సల్మాన్ కాస్త అసౌకర్యంగా కనిపించాడు. దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలయ్యింది.అయితే అభిమానులెవరు కంగారు పడాల్సిన పని లేదని వైద్యుల సలహాలు తీసుకుంటు షూట్ లో పాల్గొంటున్నాడని సల్మాన్ సన్నిహిత వర్గాలు అంటున్నాయి. దీంతో సల్మాన్ కి సినిమా పట్ల ఉన్న అడెక్షన్ ఈ పాటిదో అర్ధమవుతుందని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
పూర్తి పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న సికందర్ కి హిట్ చిత్రాల దర్శకుడు మురుగుదాస్(murugudas)దర్శకుడు కావడంతో అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. పైగా అమీర్ ఖాన్ తో చేసిన గజనీ తర్వాత మురుగుదాస్ చాలా ఏళ్ళ తర్వాత బాలీవుడ్ లో మళ్ళీ అడుగుపెట్టబోతున్నాడు. నెక్స్ట్ ఇయర్ రంజాన్ కి ఎలాగైనా రిలీజ్ చేయాలనే ప్లాన్ లో సల్మాన్ ఉన్నట్టుగా తెలుస్తుంది.రష్మిక మందన్న హీరోయిన్ అవ్వడం కూడా సినిమా మీద క్యూరియాసిటీ ని పెంచుతుంది.ఇక సల్మాన్ గాయాల వార్త నేపథ్యంలో రష్మిక(rashmika mandanna)ప్రెజెంట్ ఏ మూవీ షూట్ లో చేస్తుందా అని ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా అరా తీస్తున్నారు. ఆమె చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్ లు ఉన్న విషయం తెలిసిందే.