రవీనా తండ్రి రవి టాండన్ మృతి
on Feb 12, 2022

రవీనా టాండన్ తండ్రి, ఒకప్పటి పాపులర్ డైరెక్టర్-ప్రొడ్యూసర్ రవి టాండన్ కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. ఊపిరి సరిగా అందకపోవడంతో శుక్రవారం ముంబైలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. తండ్రి మరణానికి శోకతప్తురాలైన రవీనా ఆయనతో తన అనుబంధాన్ని తెలిపే ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. తండ్రితో తన చిన్నప్పటి ఫొటోతో పాటు, ఇటీవలి కాలంలో తీసుకున్న ఒక బ్లర్డ్ ఫొటోను కూడా ఆమె షేర్ చేశారు. "మీరెప్పుడూ నాతో నడుస్తూనే ఉంటారు. నేనెప్పుడూ మీలాగే ఉంటాను. నేనెప్పటికీ మిమ్మల్ని వదలను. లవ్ యు పాపా" అని ఆమె రాసుకొచ్చారు.
రవి టాండన్ పలు హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. వాటిలో టాప్ యాక్టర్లతో చేసినవి ఉన్నాయి. అమితాబ్ బచ్చన్‌తో 'ఖుద్ దార్', రిషి కపూర్‌తో 'ఖేల్ ఖేల్ మే', రాజేశ్ ఖన్నాతో 'మజ్‌బూర్', సంజీవ్ కుమార్‌తో 'జిందగీ' సినిమాలను ఆయన తీశారు. రవి టాండన్‌కు భార్య వీణ, కుమార్తె రవీనా, కుమారుడు రాజీవ్ టాండన్ ఉన్నారు. రవీనా త్వరలో 'కేజీఎఫ్: చాప్టర్ 2'లో కనిపించనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



