Home

»

Bollywood News

Ramayana: బాక్సాఫీస్ ప్రభంజనం.. 8 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్‌లోకి ‘రామాయణ’.!

Nov 13, 2026 10:36AM

భారతీయ ఇతిహాసం రామాయణం కథను వెండితెరపై ఆవిష్కరిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రామాయణ’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు ఏర్పరచుకున్న ఈ సినిమా.. ఇప్పుడు వసూళ్లలోనూ అదే స్థాయి జోరు చూపిస్తోంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటేసింది. ఈ విషయాన్ని మేకర్స్ ప్రత్యేక పోస్టర్ల ద్వారా ప్రకటించారు.

నితేశ్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మించిన ఈ సినిమా నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటించారు. విడుదలైన మొదటి రోజు నుంచే భారీ వసూళ్లు సాధిస్తున్న ఈ చిత్రం.. కేవలం ఎనిమిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 

దీంతో అత్యంత వేగంగా రూ.1000 కోట్ల క్లబ్‌లోకి చేరిన భారతీయ చిత్రాల్లో మూడో స్థానంలో నిలిచింది. 'పుష్ప-2', 'ధురంధర్-2' సినిమాలు ఏడు రోజుల్లో ఈ ఫీట్ ను సాధించాయి. అయితే ఆ రెండు సినిమాలు సీక్వెల్స్ కాగా.. ‘రామాయణ’ ఫస్ట్ పార్ట్ తోనే ఇంతటి సంచలనం సృష్టించింది.

ఈ సినిమా వసూళ్లను పరిశీలిస్తే.. భారత్‌లో ఇప్పటివరకు రూ.564.60 కోట్ల నెట్, రూ.675.05 కోట్ల గ్రాస్ సాధించింది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి మరో రూ.358.50 కోట్ల గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. దీంతో వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ.1,033.55 కోట్లకు చేరింది. ముఖ్యంగా విదేశాల్లోనూ సినిమాకు వస్తున్న ఆదరణ ఈ భారీ వసూళ్లకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి: ‘వారణాసి’ మూవీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే.!

‘రామాయణం’ రణ్‌బీర్ కపూర్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అంతేకాదు, భారతీయ సినీ పరిశ్రమలో రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన 11వ సినిమాగా రికార్డులకెక్కింది.

మొత్తానికి ‘రామాయణ’ మొదటి భాగం ఎనిమిది రోజుల్లోనే రూ.1000 కోట్ల మార్క్‌ను దాటేయడంతో ఇప్పుడు అందరి దృష్టి సినిమా ఫుల్ రన్‌పై పడింది. ఈ వసూళ్లు ఇంకా ఎంత దూరం వెళ్తాయి? భారతీయ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తుందా? చూడాలి.

మీకు నచ్చవచ్చు:
శోభన్ బాబుకు స్టార్‌డమ్ తెచ్చిన మూవీ.. 'తాసిల్దార్ గారి అమ్మాయి' వెనుక ఇన్ని విశేషాలా.?
‘గాడ్ ఆఫ్ వార్’కి బ్రేక్: చిరంజీవితో త్రివిక్రమ్ సినిమా.. ప్రొడ్యూసర్ ఎవరో తెలిస్తే షాక్.!

 

 

 

[Ramayana 1000 Crore, Ramayana Box Office, Ranbir Kapoor, Sai Pallavi, Yash]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com