ENGLISH | TELUGU  

భ‌ర్త నిక్‌తో క‌లిసి లాస్ ఏంజెల్స్ ఇంటిలో దీపావ‌ళి పూజ జ‌రుపుకున్న ప్రియాంక‌!

on Nov 5, 2021

 

దీపావ‌ళి వేడుక‌లను ప్ర‌పంచ‌వ్యాప్తంగా గురువారం ఆనందోత్సాహాల మ‌ధ్య జ‌రుపుకున్నారు. కొవిడ్ మ‌హ‌మ్మారితో ఒక‌టిన్న‌ర సంవ‌త్స‌రం పైగా ఇబ్బందులు ఎదుర్కొంటూ వ‌స్తోన్న జ‌నం.. గ‌త ఏడాది పండుగ‌ను స‌రిగా జ‌రుపుకోలేక‌పోయిన విష‌యం తెలిసిందే. ఈసారి మాత్రం ఫ్యామిలీ మెంబ‌ర్స్‌, ఫ్రెండ్స్‌తో కాస్తం సంద‌డిగా పండుగ‌ జ‌రుపుకున్నారు. సినీ సెల‌బ్రిటీలు త‌మ కుటుంబ‌స‌భ్యుల‌తో పండుగ జ‌రుపుకొని, దానికి సంబంధించిన పిక్చ‌ర్స్‌ను సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. 

గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా, ఆమె భ‌ర్త నిక్ జోనాస్ సైతం గురువారం లాస్ ఏంజెల్స్‌లోని త‌మ ఇంట్లో దీపాలు వెలిగించి, మ‌హాల‌క్ష్మి పూజ నిర్వ‌హించి, దీపావ‌ళిని వేడుక‌గా జ‌రుపుకున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోల‌ను ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ప్రియాంక షేర్ చేసింది. ప్రియాంక ప‌సుపు రంగు చీర ధ‌రించి, బ్యూటిఫుల్‌గా క‌నిపిస్తుండ‌గా, నిక్ జోనాస్ వైట్ కుర్తా ధ‌రించి హ్యాండ్స‌మ్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చాడు. "With the blessings of Goddess Mahalakshmi we invite Her grace and abundance into our home. Happy Diwali,” అంటూ రాసుకొచ్చింది ప్రియాంక‌.

ప్రియాంక‌, నిక్ భిన్న మ‌త విశ్వాసాల‌కు చెందిన వాళ్ల‌యిన‌ప్ప‌టికీ, ఒక‌రి న‌మ్మ‌కాల‌ను మ‌రొక‌రు గౌర‌వించుకుంటూ వ‌స్తున్నారు. అందులో భాగంగా ఇటు హిందూ పండుగ‌ల‌ను, అటు క్రిస్టియ‌న్ ఫెస్టివ‌ల్స్‌ను ఇద్ద‌రూ క‌లిసి జ‌రుపుకుంటున్నారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.