'సింగం ఎగైన్'లో ప్రభాస్.. దీపావళికి మోత మోగిపోద్ది!
on Sep 4, 2024
బాలీవుడ్ లో డైరెక్టర్ రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ లో భాగంగా రూపొందే 'సింగం' (Singham) సిరీస్ కి మంచి క్రేజ్ ఉంది. ఇప్పటిదాకా ఈ సిరీస్ నుంచి 'సింగం', 'సింగం రిటర్న్స్' రాగా.. రెండూ ఘన విజయం సాధించాయి. హీరోగా అజయ్ దేవ్‌గణ్ కి ఈ సినిమాలు మంచి కమర్షియల్ సక్సెస్ ని అందించాయి. ఇప్పుడు అజయ్ దేవ్‌గణ్-రోహిత్ శెట్టి కాంబినేషన్ లో 'సింగం ఎగైన్' (Singham Again) వస్తోంది.
అసలే అజయ్ దేవ్‌గణ్- రోహిత్ శెట్టి కాంబో మూవీ. పైగా సింగం సిరీస్. కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, దీపికా పదుకొణె వంటి ఎందరో స్టార్స్ సందడి చేయనున్నారు. దీంతో నార్త్ లో ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు ఈ అంచనాలను పాన్ ఇండియా రేంజ్ కి తీసుకెళ్లే న్యూస్ ఒకటి వినిపిస్తోంది. అదేంటంటే 'సింగం ఎగైన్'లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) అతిథి పాత్రలో మెరవనున్నాడట.
తాజాగా రోహిత్ శెట్టి ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో ఒక కార్ జంప్ చేస్తున్నట్టు ఉండగా, బ్యాక్ గ్రౌండ్ లో ప్రభాస్ రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ 'కల్కి 2898 AD' మ్యూజిక్ వినిపిస్తోంది. 'కల్కి'లో బుజ్జి వెహికిల్ పై ప్రభాస్ ఎంట్రీని గుర్తు చేసేలా ఆ వీడియో ఉంది. ఇక ఆ వీడియోని పోస్ట్ చేయడంతో పాటు.. "ఈ హీరో లేకుండా 'సింగం' అసంపూర్ణంగా ఉంటుంది. దీపావళికి కారులోనుంచి హీరో దిగుతాడు." అని రాసుకొచ్చాడు రోహిత్ శెట్టి. ఆయన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ని బట్టి చూస్తే.. 'సింగం ఎగైన్'లో ప్రభాస్ గెస్ట్ రోల్ లో మెరవనున్నాడని అర్థమవుతోంది. అదే జరిగితే నార్త్ తో పాటు, సౌత్ లో కూడా.. అందునా ముఖ్యంగా తెలుగు స్టేట్స్ లో 'సింగం ఎగైన్'పై ప్రేక్షకుల దృష్టి పడుతుంది అనడంలో సందేహం లేదు.
అయితే బాలీవుడ్ మీడియాలో మాత్రం 'సింగం ఎగైన్'లో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. కానీ రోహిత్ శెట్టి పోస్ట్ చేసిన వీడియోలో 'కల్కి' మ్యూజిక్ పెట్టడం చూస్తుంటే ప్రభాస్ ఖచ్చితంగా ఉంటాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, పదేళ్ల క్రితం అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన 'యాక్షన్ జాక్సన్' మూవీలో ఒక సాంగ్ లో ప్రభాస్ మెరవడం విశేషం. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అజయ్ దేవ్‌గణ్ సినిమాలోనే ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించనున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది.
Also Read