‘ఆస్కార్ 2026’ నామినేషన్ పొందిన జాన్వీ కపూర్ సినిమా!
on Sep 19, 2025
భారత్ తరఫున ఆస్కార్ 2026 నామినేషన్ పొందింది జాన్వీ కపూర్ నటించిన ‘హోమ్ బౌండ్’ చిత్రం. నీరజ్ ఘేవాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ఏడాది మే 21న కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ఈ చిత్రం విడుదలైంది. ఇండియాలో సెప్టెంబర్ 26న థియేటర్లలో విడుదల కాబోతోంది. అయితే విడుదలకు ముందే ఈ సినిమా అనేక ప్రశంసలు అందుకుంది. పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు 98వ అకాడమీ అవార్డ్స్ 2026 కోసం ఇండియా తరఫున అఫీషియల్‌గా ‘హోమ్ బౌండ్’ చిత్రాన్ని పంపించనున్నారు. ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ విభాగంలో ఈ సినిమా పోటీ పడనుంది.
‘హోమ్ బౌండ్’ చిత్రం ఆస్కార్ ఎంట్రీ సాధించిన విషయాన్ని సెలక్షన్ కమిటీ చైర్‌పర్సన్ ఎన్.చంద్ర తెలియజేశారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమ నుంచి ఈ సంవత్సరం 24 సినిమాలు ఆస్కార్ ఎంట్రీకి పోటీ పడ్డాయని, అన్నీ మంచి సినిమాలేనని, మనసు హత్తుకునే సినిమాలేనని ఆయన తెలిపారు. వాటిలో ‘హోమ్ బౌండ్’ చిత్రాన్ని ఎంపిక చేశామన్నారు. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్, అదార్ పూనావాలా, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా సంయుక్తంగా నిర్మించారు. ఎంట్రీ విషయాన్ని ప్రకటించిన అనంతరం ఈ చిత్ర నిర్మాతలు తమ సంతోషాన్ని వ్యక్తవం చేస్తూ తమ సినిమా భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీ పొందడం తమకెంతో గర్వకారణమని అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



