చనిపోయిన వారంతా నడుచుకుంటూ వస్తారని నటుడు అలీకి తెలుసంట
on Dec 4, 2024
ఓటిటిలో విశేష ఆదరణ పొందిన వెబ్ సిరీస్ లలో మీర్జాపూర్(mirzapur)సిరీస్ కూడా ఒకటి. మొత్తం మూడు సీజన్లుగా అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలవ్వగా కోట్లలో వ్యూస్ ని సంపాదించుకుని ఓటిటి చరిత్రలోనే ఎన్నో రికార్డులు సృష్టించింది.దీంతో ప్రేక్షకుల డిమాండ్ ప్రకారం ఇప్పడు ఈ సిరీస్ సినిమాగా తెరకెక్కబోతుంది. ఇందుకు సంబంధించి కొన్ని రోజుల క్రితం అధికార ప్రకటన కూడా వచ్చింది.
రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించి ప్రముఖ నటుడు అలీ ఫజిల్(ali fazal)మాట్లాడుతూ మీర్జాపూర్ ఫిలిం ఇంగ్లీష్ సినిమా పీకీ బ్లైండర్ తరహాలో ఉండే అవకాశం ఉంది.సిరీస్ మూడు పార్టుల్లో చనిపోయిన వారు నడుచుకుంటూ వచ్చి తెరపై కనిపిస్తారు.సిరీస్ లకి ఫ్రీక్వెల్ గా సినిమాని రూపొందించడం జరుగుతుందని తెలిపాడు.మీర్జాపూర్ సిరీస్ లో గుడ్డు భయ్యాగా అలీ ఒక రేంజ్ లో నటించి ఎంతో మందికి అభిమాన నటుడుగా మారాడు.
ఇక క్రైమ్,అండ్ థ్రిల్లర్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ లకి గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించగా 2018 , 2020 ,2024 సంవత్సరాల్లో మూడు సిరీస్ లు రిలీజ్ అయ్యాయి.అలీ తో పాటు పంకజ్ త్రిపాఠి, శ్వేతా త్రిపా, దివ్యేంద్ర శర్మ,శ్రీయ,హర్షిత్ గౌర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.