60 కోట్లు పెడితే 10 కోట్లు వచ్చాయి..మరి ఓటిటికి ఎప్పుడు
on Mar 31, 2025

శ్రీదేవి(Sridevi)చిన్నకూతురు ఖుషి కపూర్(Khushi Kapoor)జునైద్ ఖాన్(Junaid Khan)జంటగా తెరకెక్కిన బాలీవుడ్ మూవీ 'లవ్ యాపా'(Loveyapa).అద్వైత్ చందన్(Advait Chandan)దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్ టైన్ మెంట్,ఫాంటమ్ స్టూడియోస్ పై కల్పతి ఎస్. అఘోరం,కల్పతి ఎస్. గణేష్,కల్పతి ఎస్.సురేష్,మధుమంతెన,భావన తల్వార్,శ్రుష్టి బెహల్ ఆర్య నిర్మించగా ఫిబ్రవరి 7 న హిందీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ హిట్ మూవీ 'లవ్ టుడే'కి రీమేక్ గా తెరకెక్కగా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని చవిచూసింది.
60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే 10 కోట్లు కూడా వసూలు చెయ్యలేదు.దీంతో మేకర్స్ భారీ నష్టాలు చవి చూడాల్సి వచ్చింది.ఇప్పుడు ఈ మూవీ ఓటిటిలో అడుగుపెట్టబోతోంది.జియో హాట్ స్టార్ వేదికగా ఏప్రిల్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుండగా మరి ఓటిటిలో ఎంత మేర ఆదరణ పొందుతుందో చూడాలి.అశుతోష్ రానా,గృషా కపూర్,కికు షార్ధ కీలక పాత్రల్లో కనిపించారు.
.webp)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



